మార్కెట్ లో వెబ్ సిరీస్ హవా!

మార్కెట్ లో వెబ్ సిరీస్ హవా!

 ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో వెబ్సిరీస్లు తెలుగు ఓటీటీలని ముంచెత్తబోతున్నాయి. ఇప్పటికే మంత, ప్రియమణి, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో అడుగు పెట్టారు. మరో పక్క పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఓటీటీ వైపే చూస్తున్నాయిచిరంజీవి పెద్ద కూతురు సుస్ మితా కూడా వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టెర్రరిస్ట్ థీమ్తో, ‘ఓయ్మూవీ డైరెక్టర్ ఆనంద్ రంగా వెబ్ సిరీస్  డైరెక్ట్  చేస్తున్నాడు. ఇక షార్ట్ ఫిలింస్ చేసే చిన్న టీమ్స్కూడా వెబ్ సిరీస్ బాటలోనే ఉన్నాయి. అడల్ట్, లవ్, కామెడీ, క్రైం ఇప్పుడు ఎక్కువగా వస్తో న్న సబ్జెక్స్ట్ కావడం వల్ల ఎటూ కొం మార్కెట్ ఉంటుంది. వీటికి తక్కువ బడ్జెట్‌‌‌‌ కాబట్టి, ఎక్కువగా కొత్తనటులని తీసుకుని ఒకరో ఇద్దరో క్రేజ్ ఉన్న సినిమా యాక్టర్స్ను తీసుకుంటే చాలు అన్నట్టుగానే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఇక ఓటీటీలు కూడా ఇప్పుడు సినిమాల కంటే వెబ్సిరీస్ మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. తెలుగులో ట్రెండ్మరిం ఊపందుకుంటే అటు సినిమా, ఇటు వెబ్సిరీస్‌ .. రెండూ కొత్త చాప్టర్‌‌‌‌‌‌‌‌ను  చూపించబోతున్నట్లే. వీటికి ఆదరణ మరింత పెరిగితే పాపులర్‌‌‌‌‌‌‌‌, లీడ్యాక్టర్స్ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్వాలిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు సినిమా రేంజ్ మార్కెట్‌‌‌‌ని వెబ్ సిరీస్ అందుకోవటానికి పెద్ద టైం ఏమీ పట్టదు.

ఒకప్పుడు టీవీ సీరియల్స్‌ , ప్రేక్షకులకు సినిమాకు ఆల్టర్నేటివ్‌ ఎంటర్టైన్మెంట్ఎక్స్పీరియెన్స్అందిస్తే.. ఇప్పుడా స్థా నాన్ని వెబ్సిరీస్లు భర్తీ చేస్తున్నాయి. అటు టీవీ సీరియల్‌‌‌‌నీ, ఇటు సినిమానీ కలిపిన కొత్త ఫార్మాట్ వెబ్ సిరీస్గా వచ్చింది. సినిమా, టీవీల కంటే ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్‌ ) ఫ్లా ట్ ఫాం దూసుకు పోతోంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా చూస్తోంది వెబ్సిరీస్లే. ప్రైమ్వీడియో, నెట్ఫ్లిక్స్‌ , జీ ఫైవ్‌ , ఆహా, సన్నెక్ స్ట్డిస్నీ ప్లస్హాట్స్టార్వంటి ఓటీటీ ప్లా ట్ఫామ్స్దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా వీటిలో ఎక్స్క్లూజివ్వెబ్సిరీస్లు ఆడియెన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

హిందీ, ఇంగ్లీష్‌ లో వెబ్‌ సిరీస్‌ ల హవా ఎక్కువగా ఉండగా, ఈమధ్య తెలుగు వెబ్‌ సిరీస్‌ లు కూడా సక్సెస్‌ అవుతున్నాయి. వీటికీ మంచి ఆదరణ దక్కుతోంది. లేటెస్ట్‌ ట్రెండ్‌ కి తగ్గట్టే ఇప్పుడు తెలుగులో కూడా వెబ్ సిరీస్ హవా మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నేళ్లలో సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. సినిమాల్నే పట్టుకుని వేలాడకుండా అదేలాంటి ఎంటర్‌ టైన్‌మెంట్‌ అందించే వెబ్ సిరీస్‌లనూ ఆదరిస్తున్నారు. నిహారికా కొణిదెల తీసిన ముద్ద పప్పు ఆవకాయ, మహాతల్లి, పోష్ పోరీస్‌ లాంటి వెబ్ సిరీస్‌ లు కొన్ని యూట్యూబ్ లో వచ్చినా అప్పట్లో ఇంత క్రేజ్ లేదు కాబట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. కాకపోతే మంచి ఎంటర్టైనర్లుగా కాస్త పేరు తెచ్చుకున్నాయి.

స్టా ర్స్కూడా

తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అటు వైపు మళ్లుతున్నారు. లాక్ డౌన్ టైంలో చాలామంది వెబ్ సిరీస్‌ లు చూసి.. వాటికి అలవాటు పడుతున్నారు. కానీ, తెలుగులో ఎంతైనా వెబ్ సిరీస్‌ ల క్వాలిటీ తక్కువగానే ఉంటోంది. కానీ మార్కెట్ పెరిగే కొద్దీ ఇక్కడ కూడా క్వాలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. నిన్నా మొన్నటి వరకూ పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా వెతికి మరీ యూట్యూబ్‌ లో ఉన్న పాత తెలుగు వెబ్ సిరీస్‌ లని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇటువైపు అడుగులు వేస్తున్నారు. సినిమాల్లో కాస్త కెరీర్ వెనుకబడ్డ పాత వైభవం పోగొట్టుకోవటం ఇష్టం లేని యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్‌ లోకి రావటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్ సినిమా కంటే ఏమాత్రం తక్కువకాదు. ఇక్కడ రెమ్యునరేషన్స్, మార్కెట్ కూడా భారీగానే ఉంటోంది. తెలుగులో ఇప్పటికే చెప్పుకోదగ్గ క్వాంటిటీలోనే వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అయితే కేవలం తెలుగులోనే వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ ల గురించి ఓసారి చూద్దాం…

స్టో రీ డిస్కషన్, నిరుద్యోగ నటులు

ఒక సినిమా తీయటం, దానివెనుక ఉండే మలుపులు, కొత్త ఆలోచనలతో ఇండస్త్రీలో ఉన్న బ్యాచ్ థింకింగ్ ఎలా ఉంటోందీ చెప్పిన వెబ్ సిరీస్‌లు ఈ రెండు. రోహిత్, శశి అనే ఇద్దరు తమ లాగే ఆలోచించే వాళ్లతో తీసిన ఈ రెండు సిరీస్‌లూ ఒక ఊపు ఊపాయి.తెలుగులో కూడా ఇంత డిఫరెంట్ గా ప్రజెంట్ చెయ్యొచ్చు అనే ఆలోచన తెచ్చింది మాత్రం ఈ రెండు సిరీస్‌ లే అని చెప్పొచ్చు. మేకింగ్‌‌‌‌లోనూ, ప్రజెంటేషన్‌ లోనూ నేషనల్ స్థాయికి తగ్గకుండా, లోకల్ టాలెంట్ ని వాడుకుంటూ తక్కువ బడ్జెట్ లో తీసిన వెబ్ సిరీస్‌లు ఇవి. రీసెంట్ గా ‘నిరుద్యోగ నటులు’ని ఎడిట్ చేసి సినిమాగా మార్చి, ఓటీటీలో కూడా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది మరీ కొత్త ప్రయోగం. ఒక వెబ్ సిరీస్ ని సినిమాగా కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనే ఆలొచనే డిఫరెంట్ గా ఉంది.

చదరంగం

జీ 5 లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ లేటెస్ట్ ట్రెండ్ పాలిటిక్స్‌‌‌‌నే టార్గెట్ గా చేసుకొని తయారైంది. హీరో శ్రీకాంత్, చలపతి రావ్, నాగినీడు, జయశ్రీ రాచకొండ లాంటి సీనియర్‌ యాక్టర్స్‌‌‌‌తో మంచి కంటెంట్‌ గా పేరు తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్‌ ను మంచు విష్ణు ప్రొడ్యూస్ చేశాడు. ఒక సినిమాగా వచ్చి ఉంటే ఈ సబ్జెక్ట్ అంతగా క్లిక్ అయ్యేది కాదేమో గానీ వెబ్ సిరీస్ గా మాత్రం సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. సినిమాకి ఉన్నన్ని సెన్సార్ రూల్స్​ లేకపోవటం కూడా ఈ వెబ్ సిరీస్​కు కలిసొచ్చింది. తరువాత కొన్ని కాంట్రవర్షియల్ విషయాలని ఓపెన్​గా డిస్కస్ చేయటానికి కారణం అయ్యింది.

సిన్

ట్రైలర్ వచ్చినప్పుడు అడల్ట్ కంటెంట్‌ అనిపించుకున్నా, రిలీజ్‌‌‌‌ తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సిరీస్‌ గా పేరు తెచ్చుకుంది ‘సిన్‌ ’. అల్లు అరవింద్ మొదలుపెట్టిన ఓటిటి ప్లాట్‌ ఫామ్‌‌‌‌ ‘ఆహా ఒరిజినల్స్‌‌‌‌’లో మంచి మార్కెట్ నే రాబట్టుకుం ది. ఇందులో జాగ్వార్ ఫేమ్ దీప్తి సోథితో పాటు జార్జ్ రెడ్డి ఫేమ్ తిరువీర్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌ ను నార్త్ స్టార్ ఎంటర్‌ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ప్రొడ్యూస్ చేశాడు. మొత్తం అడల్ట్ కంటెంట్‌ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఈ కథలో. అమ్మాయిలకు మనసు ఉంటుందని.. దాంతో ఆడుకోవద్దని చెప్పే వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ రూపొందించిన నవీన్ మేడారం, డైరెక్టర్‌ గా మంచి మార్కులే తెచ్చుకున్నాడు.

కొత్త పోరడు

న్యూవేవ్ జనరేషన్ థాట్స్ ఎలా ఉంటాయో చెప్పిన వెబ్ సిరీస్ ఇది. దర్శకుడిగా, నటుడిగా అన్వేష్ మైఖేల్ ఈ ఒక్క వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ రాబట్టుకున్నాడు. పూర్తి తెలంగాణ భాష, నేపథ్యం చూపిస్తూ రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది వచ్చిన తెలుగు వెబ్‌ సిరీస్‌లలో కింగ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చిన్న బడ్జెట్ సినిమా అంత క్రేజ్‌‌‌‌తో కటౌట్లు కట్టి మరీ ప్రమోట్ చేసేంతగా తెలుగు వెబ్ సిరీస్‌ కి ఒక రేంజ్ తీసుకు వచ్చింది ‘కొత్త పోరడు’.

గ్యాం గ్స్టా ర్స్

అమేజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ ఫాంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘గ్యాంగ్‌‌‌‌స్టార్స్’. నందినీ రెడ్డి కథ అందించగా, అజయ్ భూయాన్ డైరెక్ట్‌ చేశారు. జగపతి బాబు రౌడీ పాత్రలో నటించిన ఈ సిరీస్‌ లో నవదీప్, శ్వేతా బసు, సిద్ధు జొన్నలగడ్డ, అపూర్వ అరోరా, శివాజీ, పోసాని, రాహుల్ రామకృష్ణ లాంటి వెల్ నోటెడ్ యాక్టర్స్ నటించారు. అయితే ఈ సిరీస్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు.

లూజర్

‘పెళ్లి చూపులు’ ఫేం ప్రియదర్శి లీడ్ రోల్‌‌‌‌లో వచ్చిన ‘లూజర్’ జీ5 లో రిలీజ్ అయ్యింది. ఈ పది ఎపిసో డ్ల సిరీస్‌ మంచి టా క్ రాబట్టుకుంది. రైఫిల్ షూటింగ్‌ లో చిన్న వయసులోనే నేషనల్ స్థా యికి ఎదిగిన ఒక షూటర్.. ఇంటర్నే షనల్ క్రికెట్ ఆడేందుకు చాలా ద గ్గరగా వెళ్లిన ఒక క్రికెటర్, బ్యాడ్మింటన్‌‌‌‌లో ఇంటర్నే షనల్ లెవెల్ లో ఆడగలిగిన టాలెం ట్ ఉన్న ఒక అమ్మాయి… ఈ ముగ్గురి జీవితాలతో అల్లిన కథతో రూపొందిం ది ‘లూజర్‌‌‌‌‌‌‌‌’. మేకింగ్‌ లోనూ మంచి మార్కులే పడ్దాయి. ప్రియదర్శితో పాటు శశాంక్, కల్పిక, షాయాజి షిండే లతో కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి మంచి కంటెంట్ నే ఇచ్చాడు.