రాష్ట్రపతి భవన్ లో మొట్టమొదటి సారి పెళ్లి జరగబోతోంది. ఇప్పటి వరకు ఎన్నడూ రాష్ట్రపతి అధికారిక నివాసంలో ఇలాంటి వేడుకలు జరగలేదు. కానీ చరిత్రలో ఫస్ట్ టైమ్ పెళ్లి జరుగుతుండటం ఇంట్రెస్టింగ్ పెంచుతోంది. అయితే ఈ పెళ్లి రాష్ట్రపతి కుటుంబానికి సంబంధించినది అనుకున్నా పప్పులో కాలేసినట్లే. మరి ఎవరి పెళ్లి అయ్యుంటుంది.. ఈ పెళ్లికి ఎందుకంత విశేషం. ప్రసిడింట్ భవన్ లో పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది..? ఇప్పుడన్ని ఇవే ప్రశ్నలు. వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రపతి బిల్డింగ్ కాంప్లెక్స్ లో ఫిబ్రవరి 12న పెళ్లి జరగనుంది. ఈ పెళ్లిని ప్రసిడెంట్ ద్రౌపది ముర్ము దగ్గరుండి జరిపించనున్నారు. దీనికి కారణం.. ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి నిజాయితీ, ప్రవర్తన రాష్ట్రపతి ముర్ముకు నచ్చడమే. మీడియా కథనాల ప్రకారం ఆ వ్యక్తి పెళ్లి సంగతి తెలుసుకున్న ముర్ము.. స్వయంగా రాష్ట్రపతి భవన్ లోనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఈ పెళ్లి చాలా తక్కువ మందితో జరగనుందని సమాచారం.
పెళ్లి ఎవరిది:
సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ అయిన పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లో పెళ్లి చేసుకోబోయే తొలి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ లో పనిచేసే గుప్తా అనే ఆపీసర్ తన సిన్సియారిటీ, ప్రవర్తనతో రాష్ట్రపతిని మెప్పించారట. అందుకే ఆమె పెళ్లి స్వయంగా అక్కడే చేసేందుకు నిర్ణయించారు ముర్ము. CRPF అసిస్టెంట్ కమాండెంట్ అయిన గుప్తా ప్రస్తుతం పీఎస్ఓ (PSO)గా పనిచేస్తున్నారు.
ALSO READ : కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
పూనమ్ గుప్తా ఫిబ్రవరి 12న జమ్మూ కశ్మీర్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న అవనీశ్ కుమార్ ను పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఈవెంట్ పరిమిత సంఖ్యలో కొద్ది మంది అతిథుల మధ్యన జరుగుతుందట. అయితే ఈ పెళ్లిపై ఇంకా రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాష్ట్రపతి దృష్టిని ఎలా ఆకర్శించారు:
CRPF అసిస్టెంట్ కమాండెంట్ అయిన పూనమ్ గుప్తా 74వ రిపబ్లిక్ డే పరేడ్ లో సీఆర్పీఎఫ్ వుమెన్ కాంటింజెంట్ కు నేతృత్వం వహించారు. 2018లో UPSC CAPF పరీక్షలో ఆల్ ఇండియా 81 ర్యాంకు సాధించారు. బీహార్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంలో గతంలో పనిచేశారు. ఇన్స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గుప్తా.. మహిళల సమస్యలపైనా, సాధికారతపైనా, విద్యార్థులను మోటివేట్ చేయడంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంటారు.