
జగిత్యాల: ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.. యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది" అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లగ్గం యాడనో ఎర్కన అంటూ ప్రదేశం పేరు, తలువాలు ఏసినంక బువ్వ తినాలంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల పేర్లను తెలిపారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్ రెడ్డి, సుగుణ దంపతులు తమ చిన్న కొడుకు సతీశ్‌రెడ్డి పెళ్లి కార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించారు. పూర్తిగా తెలంగాణ యాస ఉట్టిపడేలా " వెల్మలోళ్ల లగ్గం పిలుపు " అంటూ కార్డ్ ప్రింట్ చేయించారు.