బోలక్​పూర్​ బాకారంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం

ముషీరాబాద్, వెలుగు: బోలక్​పూర్​బాకారంలో ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి (మల్లన్న) కల్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్ట్ నల్లవెల్లి అంజిరెడ్డి దంపతులు బోనం తీసుకువచ్చి మల్లన్నకు నైవేద్యం సమర్పించారు. పంచామృత అభిషేకాలు, అగ్ని గుండాల వెలిగింపు, అగ్ని గుండాల ప్రవేశం, గొలుసులు తెంపుట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.