భారీగా పెరిగిన పెళ్లిళ్ల ఖర్చు.. సగటున ఒక్క పెళ్లికి రూ. 51లక్షలు

భారీగా పెరిగిన పెళ్లిళ్ల  ఖర్చు.. సగటున ఒక్క పెళ్లికి రూ. 51లక్షలు
  • కిందటేడాదితో పోలిస్తే 7 శాతం ఎక్కువ
  • సగటున ఒక పెళ్లికి అవుతున్న ఖర్చు రూ.51 లక్షలు
  • 10 శాతం పెరిగిన వెన్యూ, కేటరింగ్ ఖర్చులు: వెడ్‌‌‌‌మీగుడ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో పెళ్లిళ్ల ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది పెళ్లిళ్ల కోసం ఏకంగా రూ.36.5 లక్షల కోట్ల ఖర్చు జరిగిందని వెడ్డింగ్ కంపెనీ వెడ్‌‌‌‌మీగుడ్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌లో జరిపిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. సగటున ఒక వెడ్డింగ్‌ కోసం రూ.51 లక్షలను ప్రజలు  ఖర్చు చేశారు.  వెన్యూ, కేటరింగ్  ఖర్చులు కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం మేర పెరిగాయి. దీంతో పెళ్లిళ్ల కోసం జరిపే సగటు ఖర్చు కూడా పెరిగింది. ‘ పెళ్లి బాగా జరగాలని అందరూ కోరుకుంటారు.  ప్రజలు పెళ్లి వేదిక కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత ఫుడ్ కోసం,  ప్లానింగ్ ఏజెన్సీల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో చాలా కుటుంబాలు ఇల్లు కొనడానికి, తమ పిల్లల పెళ్లికి ఎక్కువగా  ఖర్చు చేస్తున్నాయి’ అని  ఢిల్లీ బేస్డ్ వెడ్డింగ్ ప్లానర్ శశాంక్‌‌‌‌ గుప్తా అన్నారు.

వెస్ట్రన్ స్టైల్‌‌‌‌కు అలవాటుపడుతూ..

సుమారు 3,500 జంటలను  వెడ్‌‌‌‌మీగుడ్‌‌‌‌ సర్వే చేసింది. ఈ స్టడీ ప్రకారం, పెళ్లిళ్ల కోసం రూ.కోటి కంటే ఎక్కువ ఖర్చు చేశామని   9 శాతం మంది పేర్కొన్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఖర్చు చేశామని మరో 9 శాతం మంది తెలిపారు. మెజార్టీ ప్రజలు పెళ్లి కోసం రూ.15 లక్షల కంటే తక్కువ ఖర్చు చేశారు. వీరి వాటా   40 శాతంగా ఉంది. 23 శాతం మంది  రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య, 19 శాతం మంది  రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఖర్చు చేశారు. పర్సనల్ సేవింగ్స్, ఫ్యామిలీ సేవింగ్స్‌‌‌‌ను పెళ్లి ఖర్చుల కోసం వాడామని 82 శాతం మంది పేర్కొనగా, లోన్లు తీసుకున్నామని 12 శాతం మంది, ఆస్తులు అమ్మామని 6 శాతం మంది వివరించారు. నవ దంపతుల కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ కోసం ఖర్చు చేయడం పెరిగిందని వెడ్‌‌‌‌మీగుడ్‌‌‌‌ ఫౌండర్ మెహ్కర్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ సహానీ అన్నారు.  

Also Read : బంగ్లాదేశ్​లో మరో హిందూ లీడర్ అరెస్ట్

పెళ్లిలో   కాక్‌‌‌‌టైల్‌‌‌‌ మిక్సింగ్‌‌‌‌, గేమింగ్‌‌‌‌ సెషన్లు పెట్టడం, వెన్యూ వద్ద  టెంపరరీ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం వంటి వాటికి  జెన్‌‌‌‌  జెడ్ కపుల్స్ ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది వెస్ట్రన్ స్టైల్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌లను తమ పెళ్లిలో వాడుతున్నారని,  ఉదాహరణకు థీమ్డ్‌‌‌‌ వెల్‌‌‌‌కమ్‌‌‌‌ డిన్నర్లు ఏర్పాటు చేయడం ఈ మధ్య పెరిగిందని సహానీ అన్నారు. కాగా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌‌‌‌ (సీఏఐటీ) రిపోర్ట్ ప్రకారం,  ఈ ఏడాది నవంబర్– డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సుమారు 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటితో ఏకంగా రూ.6 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది.