
ఒకే ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్లు.. పక్క గ్రామానికి చెందిన అన్నదమ్ముళ్లతో పెళ్లి కుదిరింది. అక్కా చెల్లెళ్లు ఒకే ఇంటికి వెళ్తున్నారు.. ఒకే దగ్గర ఉంటారు.. అంతా బాగుటుందని అనుకున్నారు. ఇరు కుటుంబాలు సంతోషంగా పెళ్లి తంతు మొదలు పెట్టారు. పెళ్లి కార్యక్రమాలు ఘనంగా, వైభవంగా ప్రారంభించారు. తీరా తాళి కట్టే ముందు పెళ్లి కొడుకులకు అక్కా చెల్లెళ్లు షాకిచ్చారు. మాకొద్దీ పెళ్లికొడుకులు.. అని మండపానికి వెళ్లకుండా షాకివ్వడం పెళ్లి కొడుకుల కుటుంబంతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులను షాక్ కు గురిచేసింది.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో జరిగింది ఈ షాకింగ్ ఇన్సిడెంట్. సాదాబాద్ మండలం సమద్ పూర్ గ్రామానికి చెందిన సునిల్ అనే వ్యక్తికి శివాని, భారతి అనే ఇద్దరు కూతుళ్లు. పొరుగున ఉన్న తేజ్ పూర్ గ్రామానికి చెందిన మోహిత్, నారాయణ్ అనే ఇద్దరు అన్నదమ్ములతో పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 14న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కోసం పెళ్లి కొడుకులు తమ బంధువులతో పెళ్లి కూతురు గ్రామానికి చేరుకున్నారు.
Also Read : మహారాష్ట్రలో వింత ఆరోగ్య సమస్య
పెళ్లి కోసం బరాత్ తీస్తూ గానా భజానా, తీన్ మార్ డ్యాన్సులతో అమ్మాయిల ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని షాకిచ్చారు అమ్మాయిలు. కారణం ఏంటంటే.. పెళ్లి జరగాలంటే అదనంగా కారును కట్నంగా ఇవ్వాలని అబ్బాయిల కుటుంబం డిమాండ్ చేయడం.
UP (हाथरस) : दहेज में कार मांगने पर दो बहनों ने लौटा दी बारात
— News24 (@news24tvchannel) April 17, 2025
◆ शादी में रस्म शुरू ही होने वाली थी कि लड़के के पिता ने दहेज में कार की मांग कर दी
◆ दोनों पक्षों में विवाद शुरू हो गया था, जिसके बाद दोनों दूल्हों को बिना शादी के ही वापस जाना पड़ा #UttarPradesh | #Hathras |… pic.twitter.com/nPDnCLU6MY
అయితే పెళ్లికి కట్నంగా 6 లక్షల రూపాయలు, ఇంటి, వంట సమాన్లు అన్ని ఇచ్చాం కదా.. మళ్లీ కారు ఏంటి.. అని అమ్మాయిల తండ్రి ప్రశ్నించడంతో పెద్ద గొడవే అయ్యిందట. దీంతో ఇరు కుటుంబాల బంధువులు కొట్టుకున్నారు. పెళ్లి కూతురు తండ్రిపై కూడా దాడి చేశారట.
దీంతో ఇలాంటి సంబంధం తమకు వద్దని, ఈ పెళ్లికొడుకులు మాకు అవసరం లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అమ్మాయిలు. అంతేకాకుండా.. స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.