ఇద్దరి వధువులతో పెళ్లి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం : ఒక వ్యక్తి ఇద్దరు యువతుల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. తమకు ఒక్కరే దొర్కడం లేదు. నీకేమో ఇద్దరా? అని నెట్టిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. విషయానికొస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు. అదే గ్రామానికి చెందిన సునీత, స్వప్నకుమారిలను ప్రేమించాడు. ఏడాదిగా ఇద్దరితో కాపురం చేశాడు. ఇప్పుడు ఇద్దరికీ ఒక్కొక్కరు సంతానం ఉన్నారు.

కోయ గిరిజనుల్లో కొన్ని తెగలవారు కొంతకాలం కలిసి కాపురం చేశాక మ్యారేజ్​ చేసుకోవడం ఆచారం. వీరూ అదే పాటించి పెళ్లికి రెడీ అయ్యారు. ఆ శుభలేఖలో వరుడు, ఇద్దరు వధువుల పేర్లు ఉండడంతో అంతా షాక్​ గురవుతుండగా, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.