Weekend Food : సేమ్యాతో చేసే స్పెషల్ ఐటమ్స్ ఇవీ.. మీరూ ట్రై చేయండి ఇలా..!

Weekend Food : సేమ్యాతో చేసే స్పెషల్ ఐటమ్స్ ఇవీ.. మీరూ ట్రై చేయండి ఇలా..!

'సేమ్యాలతో ఏం వెరైటీలు చేయొచ్చు' అని ఎవర్ని అడిగినా... స్వీట్లో పాయసం, హాట్ ఉప్మా అని చెప్తారు. అవునా... కానీ ఎప్పుడూ ఈ రెండు వెరైటీలే తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అలాకాకుండా... ప్రతిసారీ ఇంట్రెస్టింగ్, టేస్టీగా తినాలంటే ఈ వెరైటీలు ట్రై చేయాల్సిందే. అప్పుడే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆనందంగా తింటారు.
 
 పుదీనా సేమ్యా

కావాల్సినవి : ఉడికించిన సేమ్యా - రెండు కప్పులు. పల్లీలు - ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు - ఒక టీ స్పూన్ కరివేపాకు - ఒక రెమ్మ
ఉప్పు- తగినంత గరం మసాలా - పావు టీ స్పూన్ ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు - అరటీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ జీలకర్ర అరటీస్పూన్ ఆవాలు - పావు టీ స్పూన్ పుదీనా ఆకులు - ముప్పావు కప్పు కొత్తిమీర తరుగు - పావు కప్పు

 తయారీ

స్టవ్ పాన్పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. మళ్లీ స్టర్పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు వేయాలి. నిమిషం తర్వాత పుదీనా పేస్ట్ వేసి కలపాలి. మిశ్రమం బాగా వేగాక ఉడికించిన సేమ్యా వేయాలి. రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. మరింత స్పైసీ టేస్ట్ కోసం పోపులో మసాలా దినుసులు వేసుకోవచ్చు.
 
లెమన్ బాత్
 
కావాల్సినవి :  వేగించిన సేమ్యా - ఒక కప్పు, నూనె - సరిపడా, జీలకర్ర - అర టీ స్పూన్ ఆవాలు - అర టీ స్పూన్ మినప్పప్పు - ఒక టీ స్పూన్ శెనగపప్పు - ఒక టీ స్పూన్ పల్లీలు- రెండు టేబుల్ స్పూను కరివేపాకు - ఒక రెమ్మ ఇంగువ - చిటికెడు అల్లం తరుగు - ఒక టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు - పావు కప్పు నిమ్మరసం- రుచికి సరిపడా ఎండుకొబ్బరి తురుము - ఒక టేబుల్ స్పూన్ కావాలనుకుంటే) ఉప్పు- తగినంత
  
 తయారీ

స్టవ్ప పాన్పెట్టి నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా ఉప్పు, సేమ్యా వేసి ఉడికించాలి, తర్వాత నీళ్లు వడగట్టి సేమ్యాని చల్లార్చాలి. మళ్లీ స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. అవన్నీ గ కరివేపాకు, పసుపు, అల్లం తరుగు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉడికించిన సేమ్యా, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, ఎండుకొబ్బరి తరుము వేసి కలపాలి. వేడివేడిగా ఉన్నప్పుడే పుదీనా సేమ్యాని ఏదైనా అదిరిపోతుంది.

పెరుగు సేమ్యా

కావాల్సినవి :  వేగించిన సేమ్యా - ఒక కప్పు పెరుగు- ముప్పావు కప్పు (తక్కువ కూడా వేసుకోవచ్చు) పాలు - అరకప్పు  జీడిపప్పు- అర టేబుల్ స్పూన్ నెయ్యి - అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్ నీళ్లు-రెండు కప్పులు ఉప్పు-తగినంత నూనె - సరిపడా జీలకర్ర - అర టీ స్పూన్ ఎండుమిర్చి ఒకటి ఆవాలు - పావు టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్ కరివేపాకు - ఒక రెమ్మ అల్లం తరుగు - అరటీస్పూన్ సేమ్యా స్పెషల్స్

తయారీ

జీడిపప్పుని నెయ్యిలో వేగించి పక్కన పెట్టాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు వేగించిన సేమ్యా వేసి మూత పెట్టాలి. కొంతసేపయ్యాక సేమ్యా ఉడికిందా లేదా చూసి దింపేయాలి. సేమ్యాపొడిపొడిగా ఉండాలి. తర్వాత
నూనె వేడిచేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. అందులో ఉడికించిన సేమ్యా, పెరుగు, పాలు, జీడిపప్పు, ఉప్పు, కొత్తి మీర తరుగు వేసి కలపాలి. 

బిర్యానీ

వేగించిన సేమ్యా - ఒక కప్పు నెయ్యి- సరిపడా.. బగారా ఆకు- రెండు మసాలా దినుసులు (లవంగాలు, ఇలాబీలు, దాల్చిన చెక్క, షాజీరా) --ఒక టీస్పూన్ జీలకర్ర - అర టీ స్పూన్ ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు పచ్చిమిర్చి - రెండు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్ క్యారెట్ తరుగు - ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన అలుగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన బఠాణీ - రెండు టేబుల్ స్పూన్లు బీసీ తరుగు - ఒక టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత కారం - పావు టీ స్పూన్ పసుపు-చిటికెడు గరం మసాలా - ఒక టీ స్పూన్ పెరుగు - పావు కప్పు
పుదీనా ఆకులు - రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - పావు కప్పు నీళ్లు - ఒకటి ముప్పావు కప్పు

 తయారీ

స్టవ్ పై పెద్ద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో మసాలా దినుసులు. వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాల తర్వాత క్యారెట్, ఆలు గడ్డ, బీన్స్ తరుగు, బఠాణీ గింజలు వేసి కలపాలి. స్టవ్ మంట తగ్గించి కారం, పసుపు, గరం మసాలా వేయాలి. ఆపైన పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, నీళ్లు పోసి మరిగించాలి. అందులో వేగించిన సేమ్యా వేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. అంతే, ఘుమఘుమలాడే సేమ్యా బిర్యానీ రెడీ.