Telangana Tour : ఎలగందుల ఖిల్లా.. చెచ్చెర జలపాతం.. జోడేఘాట్ చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి రూట్ మ్యాప్ ఇలా..?

Telangana Tour : ఎలగందుల ఖిల్లా.. చెచ్చెర జలపాతం.. జోడేఘాట్ చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి రూట్ మ్యాప్ ఇలా..?

టూరిజం.. ఆఫీస్, ఇళ్లు.. ఇలా నిత్యం సతమతం అయ్యే వారికి ప్రకృతి అందాలు రిలాక్స్ ఇస్తాయి. కొందరు దేశంలో తిరుగుతారు.. మరికొందరు విదేశాలకు వెళతారు.. అందరూ ఇలా తిరగలేరు.. మన చుట్టూ.. మన దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఆస్వాదిస్తారు. మన తెలంగాణలోనూ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి.. వన్ డే ట్రిప్ తో అలా వెళ్లి రావొచ్చు.. ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వొచ్చు కూడా.. అలాంటి రెండు టూరిస్ట్ స్పాట్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం.. మరో విశేషం కూడా ఉందండీ.. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం.. వరల్డ్ టూరిజం డే అన్న మాట..

ఖిల్లా అంటే ఎలగందుల ఖిల్లా 

ఏ ప్రాంతానికైనా వారసత్వంగా వచ్చేని ఒక్కో కాలంలో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించిన కట్టడాలు, సంస్కృతి, సంప్రదాయాలే. చార్మినార్ అయినా, గోల్కొండ కోట అయినా ఆ శిల్ప సంపదతో నిలబడ్డవే. అలా తెలంగాణలో ఎక్కడికెళ్లి వెతికినా కోటలు, పురాతన నిర్మాణాలు కనిపిస్తాయి. కాకపోతే అందులో చాలా వాటిని పట్టించుకోకపోవడమే విచారకరం. ఎలగందుల ఖిలా దగ్గరికి వెళ్తే ఎవ్వరైనా, దీన్ని ఎందుకు డెవలప్ చెయ్యడు? అనేస్తారు కరీంనగర్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఖిల్లాకు ఎంతో చరిత్ర ఉంది.

1195 సంవత్సరంలో ఇక్కడి ప్రభువు రుద్రను.. మాధవరాజు జైలుంగి హతమార్చి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత కాకతీయరాజులు 1323 వరకు పాలించారు. వీళ్ల తర్వాత 1323లో ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తినప్పుడు ఈ ఖిల్లాను స్వాధీనం చేసుకున్నాడు. ఆపై ఈ జిల్లా కొంతకాలంపాటు నవాబు వంశీయుల చేతిలో ఉండి. 1523లో కుతుబ్ ఉల్ ముల్క్ ఏలుబడిలోకి వచ్చింది. 1687లో ఢిల్లీ చక్రవర్తి బెరంగజేబు కుతుబ్ ఉల్ ములకు యుద్ధంలో ఓడించడంతో ఈ ఖిల్లా మొగల్ చక్రవర్తుల పాలనలోకి వెళ్లింది. ఔరంగజేబు ఇక్కడ అలంగిరి మసీదు కట్టించి కోటపక్కనే బించాలన్ నిర్మించాడు.

19 సంవత్సరాల పాటు ఈ ఖిల్లా మొగలాయి చక్రవర్తుల పాలనలో ఉండి తరువాత 1724లో మొదటి నిజాం ప్రభువు అయిన నిజాం ఉల్ ముల్క్ 1వ ఆసిఫ్ జాహీ పాలనలోకి వచ్చింది. అప్పటి నుంచి నిజాంచేత నియమింపబడిన జాగీర్దారు. కల్లేదారు ఎలగందుల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. 

అందమైన కోటలు

వందల ఏళ్లుగా ఎందరో రాజులు ఏలిన ప్రాంతం ఎలగందుల కోట గోల్కొండ కోటకు ఏమాత్రం తీసిపోదు. ఖిల్లా మీద ఉండే మినార్ అద్భుతమైన నిర్మాణం. వాటి కోట గోడలు, శిల్పాలు, ఆ శిల్పాలను చెక్కిన శిల్పుల నైపుణ్యం ఇక్కడ చూడొచ్చు. గోల్కొండ కోటలాగే లోపల టూరిస్టులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రకృతి అందాలు, పురాతన నిర్మాణాలు ఉన్న ఈ చోటుకి వెళ్తే.. కొత్త ఎనర్జీని వెంట తెచ్చుకున్నట్టే.


ఇలా వెళ్లాలి: కరీంనగర్ నుంచి 10-15 నిమిషాల ప్రయాణం

 

చెచ్చెర జలపాతం

ఆదిలాబాద్ పేరు చెప్తే చాలు.. ప్రకృతి అందాలకు పేరైన అడవులు గుర్తొస్తాయి. అక్కడి అందమైన జలపాతాలు గుర్తొస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో జలపాతాలున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే బాగా పేరున్నవి అయితే, ఇంకొన్ని చాలా తక్కువ మందికే తెలిసినవి. అలా ఎక్కువ మందికి పరిచయం లేని ఒక జలపాతం 'చెచ్చెర. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది ఈ జలపాతం.

చుట్టూ, ఎత్తైన పచ్చని కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తులో నుంచి కిందికి పడుతుంటుంది ఈ జలపాతం. ఆ కొండల మధ్యలో చెప్పర జలపాతాన్ని చూడటం. ఎవ్వరికైనా కనులవిందే. చెచ్చెర ఒక్కటే కాదు.. చెచ్చెర జలపాతం దగ్గరికి వెళ్లడం అన్నది డెస్టినేషన్ అయినా ఈదార్లో అటవీ ప్రాంతంలో సడవడం ఒక నుంచి అనుభూతి. గౌరగామ్ గ్రామ పంచాయితీలోని ఊళ్లలో ఆదివాసీలు ఉంటారు ఇక్కడ తమ కట్టుబాట్లు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్న ఆదివాసీలను చూడొచ్చు. దెంసా, దండారి, కోలాటం గుస్సాడీ ఆడుతూ ప్రకృతిని ఇష్టంగా చూసుకుంటున్నారు. ఆదివాసీలు, ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వాళ్లకు మంచి ప్లేస్ చెచ్చెర జలపాతం. రోడ్డు సదుపాయం ఉంటే చెచ్చెర జలపాతం కచ్చితంగా మంచి టూరిస్ట్ ఫేస్ అవుతుంది. మసాడె సంతోష్ కుమార్. ఆసిఫాబాద్

ఎలా చేరుకోవాలి 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది చెచ్చెడ జలపాతం. ఆసిఫాబాద్ నుంచి గుడిపేట్ గ్రామం వరకు రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. గుడిపేట్ నుంచి కాలినడకన అటవీ ప్రాంతం గుండా చెచ్చెర జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ దార్లోనే శ్రీ సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. కాలినడకన మొత్తం ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ దారంతా ప్రకృతి అందాలను అస్వాదిస్తూ వెళ్లొచ్చు.


జోడేఘాట్ 

ఒకప్పుడు చట్టమైన అడవి అక్కడికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లు జనం. అధికారులైతే పోలీసుల బలగంతో వెళ్లేవాళ్లు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. చుట్టూ కొండలు ఎటు చూసినా పచ్చటి చెట్టు, అడవి. కుమ్రంభీం పోరుగడ్డ జోకిమాటికి పోతే ప్రకృతిని తనివితీరా ఆస్వాదించాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ' మ్యూజియం' మొత్తం ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చేసింది.

 

ప్రత్యేకత 

అందమైన అటవీ ప్రాంతం అది గలగల బాలువారసెలయేళ్ళు వాటి సుధ్యన పూరి గుడెవేలు. ఆ గుడిసెలుసు కలిపే ఒక కుగ్రామం. ఆ గ్రామం పేరే జోటిమాట్. ఈ గ్రామం పేరు వింటేనే గిరిజన గుండెల్లో ఆనందం పరవశించిపోతుంది. 'జల్. జంగల్. జమీన్ ' అనే నినాదంతో నిజాం నవాబులతో విరోచితంగా పోరాడి వాళ్ల గుండెల్లో తూటాలై పేలిన అమరుడు, అడవి తల్లి ముద్దు బిడ్డ కుమ్రంభీం నేలకొరిగిన గడ్డ జోడేఘాట్.

ఇలా వెళ్ళండి: 

ఆదిలాబాద్ వైపు నుంచి ప్రజలు ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుండి జైనుర్ కెరమెరి, హట్టి మీదుగా జోడేఘాట్ కు చేరుకోవచ్చు. కెరమెరి మండల కేంద్రం నుండి హట్టి మీదుగా వెళ్తే 21 కిలోమీటర్ల దూరంలో జోడేఘాట్ ఉంటుంది. అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ప్రతిరోజూ జోడేఘాటు ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు నడుస్తోంది.