
మేషం : చేపట్టిన కార్యక్రమాలు నిదానిస్తాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులు కొంత సాయపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. రాబడి తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండొచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు గందరగోళం. వారారంభంలో ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలాభం.
వృషభం : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు సైతం మీ నిర్ణయాలను స్వాగతిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. అదనపు ఆదాయం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సమాయత్తం. శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అనుకూలం.
మిథునం : కొన్ని కార్యాల్లో వ్యయప్రయాసలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. రావలసిన డబ్బు సమయానికి అందదు. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు కొన్ని చికాకులు. వారం మధ్యలో వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. శుభవార్తలు.
కర్కాటకం : ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. బంధువులతో సఖ్యత. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులు గందరగోళం నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
సింహం : నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా మాటలతో ఆకట్టుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. విస్తరణ చేస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆశ్చర్యకర మైన సంఘటనలు ఎదురుకావచ్చు.
కన్య : ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. రాబడి పెరుగుతుంది. రుణాలు తీరతాయి. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వాహన, గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు శుభవార్తలు.
తుల : కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవం. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. రాబడి పెరుగుతుంది. కుటుంబసమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. శుభకార్యాలపై సోదరులతో సంప్రదింపులు. వాహన, గృహ కొనుగోలు యత్నాలు ముమ్మరం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులపై పనిభారం తగ్గుతుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు శుభదాయకమైన కాలం.
వృశ్చికం : సమాజంలో విశేష గౌరవప్రతిష్ఠలు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. భూముల లావాదేవీల్లో పురోగతి. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాల నుంచి గట్టెక్కే సమయం. వ్యాపారులకు లాభాలు. నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతం.
ధనుస్సు : కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు. నిర్ణయాల్లో నిదానం అవసరం. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు మార్చుకుంటారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు స్థానమార్పులు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహం. వారాంతంలో శుభవార్తలు. ధనప్రాప్తి.
మకరం : కొన్ని విషయాల్లో ఎటూతేల్చుకోలేక ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. రుణాల వేటలో పడతారు. వ్యాపారులకు లాభాలు దక్కవు. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు అంచనాలు కొన్ని తప్పుతాయి. వారం మధ్యలో శుభకార్యాల ప్రస్తావన. వస్తులాభాలు.
కుంభం : కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము అందదు. కొన్ని నిర్ణయాలపై పునరాలోచన చేస్తారు. గృహ నిర్మాణయత్నాల్లో అవాంతరాలు. వ్యాపారులకు సాధారణ లాభాలు. భాగస్వాములతో వివాదాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. వారం మధ్యలో వాహనయోగం. శుభకార్యాలు చేస్తారు.
మీనం : ఇంతకాలం పడిన కష్టం కొంత ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నేర్పుగా కొన్ని వివాదాల పరిష్కారం. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలం.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400
- ALSO READ: Think Positive: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆరు సూత్రాలు