వారఫలాలు (సౌరమానం) డిసెంబర్ 29 వ తేదీ నుంచి 2025 జనవరి 4వ తేదీ వరకు

వారఫలాలు (సౌరమానం)  డిసెంబర్ 29  వ తేదీ నుంచి 2025 జనవరి 4వ తేదీ  వరకు

వార ఫలాలు (డిసెంబర్ 29 నుంచి జనవరి 4, 2025 వరకు): మేష రాశి వారికి గౌరవం .. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.  ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. సింహరాశి వారు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలుండగా.. తులా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం అనగా2024 డిసెంబర్ 24 నుంచి .. 2025 జనవరి 4 వ తేదీ వరకు  12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .  

మేషరాశి:  ఈ రాశి వారికి  2024 డిసెంబర్ 29 నుంచి 2025 జనవరి 4 వరకు అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు   గౌరవంతో పాటు కీర్తి.. ప్రతిష్టలు లభిస్తాయి.  వృత్తి .. వ్యాపారాల్లో పురోభివృద్ది ఉంటుంది...  కొత్త పరిచయాలు ఏర్పడటంతో పాటు.. నిరుద్యోగులు ఆశించిన జాబ్ లభిస్తుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి.  పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు

వృషభరాశి :  ఈ వారం వృషభరాశి వారు చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది.  అనవసరంగా కొన్ని సమస్యలు వెంటాడుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  మీ ప్రమేయం లేకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకొనే అవకాశం.  కష్టపడితే కాని ఏ పనులు పూర్తి కావు.  ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా.. అవసరానికి డబ్బు అందుతుంది. అయితే కుటుంబసభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  

 మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలా చక్కగా సాగుతాయి.  ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారాల్లో అనుకోని లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తుల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ... పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగం మారాలనుకునే మిథున రాశి వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

కర్కాటకరాశి : ఈ రాశి వారు వ్యాపార రంగంలో కొన్ని మార్పులు చేపట్టే అవకాశం కలదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.  పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది.  ప్రేమ.. పెళ్లి విషయాల్లో బంధువుల నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. త్తగా గృహ నిర్మాణం మొదలు పెట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి:  ఈ రాశి వారు 2024 డిసెంబర్ 29 నుంచి.. 2025 జనవరి 4 వరకు సంతోషంగా గడుపుతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వలన మొదట కొంత అసంతృప్తి కలిగినా.. చివరకు మీరే విజయం సాధిస్తారు.  డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.ఉద్యోగస్తులకు  అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.   కుటుంబ వ్యవహారాలను సున్నితంగా డీల్ చేయండి. ఆర్ధిక విషయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కన్యారాశి : డిసెంబర్ 29 నుంచి.. 2025 జనవరి 4 వ తేదీ వరకు కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు.. అవరోధాలు కలిగినా.. మీకు శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఆదాయ వ్యవహారాలు సంతృప్తికరంగానే ఉన్నా.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనే అవకాశం కలదు. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. 

తులారాశి:  ఈ రాశి వారికి ఈ వారం లాభదాయకంగాఉంటుంది.  వృత్తి .. వ్యాపారస్తులకు అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. కుటుంబసభ్యులతో.. బంధువలు.. మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి. 

వృశ్చికరాశి:   ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలా సాఫీగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలనుపరిష్కరించుకొనేందుకు ఈ వారం అనుకూలమైన సమయం. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులు.. మీ వ్యూహాలు తగిన విధంగా పనిచేయడంతో అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు.  కొత్తగా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు.  ప్రేమ వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు వారం చివరిలో ఫలిస్తాయి. 

ధనస్సు రాశి:  ఈ రాశి వారు  ఈ వారం ( 2024 డిసెంబర్ 29 నుంచి .. 2025 జనవరి 4 వరకు) కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయం తీసుకుంటారు.  సోదరుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  వ్యాపారంలో కొత్తగా పెట్టబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు కొంత పని భారం తగ్గడంతో.. చాలా ఊరట కలుగుతుంది.  మీ మాటకు విలువ పెరగడంతో సమాజంలో గౌరవం లభిస్తుంది.అయితే వారం మధ్యలో సహోద్యోగులతో బేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలున్నాయి.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం పనులు సజావుగా సాగిపోతాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.  చాలా సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో సంతృప్తికరంగా ఉంటుంది.  ఇతరుల వ్యవహారాలను పట్టించుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు,  ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోండి. కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకొనే అవకాశాలున్నాయి. ప్రేమ.. పెళ్లి విషయాలు వారం మధ్యలో నుంచి అనుకూలంగా ఉంటాయి  

కుంభరాశి: ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ వారం కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తుల పనితీరుతో.. ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు.   ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.  అయితే ఆర్థిక వ్యవహారాల్లో ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వవద్దు.  లోన్ లు తీసుకొనే టప్పుడు అప్రమత్తంగా ఉండండి.  ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనరాశి:  ఈ రాశి వారికి .. ఈ వారం కెరీర్ విషయంలో కీలక మార్పులు వచ్చే అవకాశం కలదు.  కొత్త ప్రాజెక్ట్ లు తీసుకొని ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తారు.  మీ ఆలోచనలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు ఉపయోగపడతాయి.  కుటుంబసభ్యులకోసం సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.  కొంతకాలంటా అపరిష్కృతంగా ఉన్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.