వారఫలాలు: ఏప్రిల్​ 13 నుంచి ఏప్రిల్​ 19 వరకు

వారఫలాలు: ఏప్రిల్​ 13 నుంచి  ఏప్రిల్​ 19 వరకు

వారఫలాలు(ఏప్రిల్​ 13 నుంచి 19 వరకు): మేషరాశి వారికి ఈ వారం వ్యయప్రయాసలు ఎక్కువుగా ఉంటాయి. వృత్తి.. వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఖర్చులు అధికంగా ఉంటాయి.మిథునరాశి వారికి గతంలో వివిధ కారణాల వలన నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలిగే అవకాశం ఉంది.   జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( ఏప్రిల్​ 13 నుంచి  ఏప్రిల్​ 19 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .  

మేషరాశి:   ఈ వారం మేషరాశి వారికి వ్యయప్రయాసలు ఎక్కువుగా ఉంటాయి. వృత్తి.. వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఖర్చులు అధికంగా ఉంటాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  అయితే మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు నష్టపోతారు.  నిరుద్యోగులకు మంచి జాబ్​ లభించే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

వృషభ రాశి:  ఈ రాశి ఈ వారం అన్ని విధాలా కలసి వస్తుంది.  పంచగ్రహకూటమి వల్ల  ఆదాయం పెరుగుంతుంది.  ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.  సమాజంలో.. ఆఫీసులో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.  అనుకోకుండా బంధు వర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. 

మిథునరాశి: ఈ వారం   ( ఏప్రిల్​ 13 నుంచి  ఏప్రిల్​ 19 వరకు) ఈ రాశి వారికి భూ వివాదాలు పరిష్కారమవుతాయి.   కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. గతంలో వివిధ కారణాల వలన నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకోండి. 

కర్కాటకం:   ఈ రాశి వారికి గురుడు  లాభ స్థానంలోసంచారం వల్ల అనేక విధాలుగా దన లాభాలు కలుగుతాయి. వృత్తి.. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడాపెరుగుతాయి.  ప్రైవేట్​ ఉద్యోగస్తులు జాబ్​ మారేందుకు ఇది అనుకూల సమయం.  ఆర్థిక విషయాల్లో  జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోవడం మంచిది.

సింహరాశి :  ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులు ఆందోళన కలిస్తాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.  నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు. పెద్దల సూచనలను పాటించండి. పిల్లల విషయంలో  కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కన్యా రాశి:   ఈ వారం వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం వలన లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది.  కావున ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  జీవిత భాగస్వామి నిర్ణయం తీసుకోండి అంతా మంచే జరుగుతుంది. 

తులారాశి: ఈ రాశి వారు  ఈ వారంలో  చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నగదు చెల్లించే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.  ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఈ వారం జీవితం సాఫీగా సాగిపోతుంది.  నిరుద్యోగులు.. పెళ్లికోసం ఎదురు చూసే  వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

వృశ్చికరాశి:  ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయినా సంతృప్తికరంగానే ఉంటుంది.  ఈ రాశివారి సమర్థతకు, ప్రయోజకత్వానికి ఆశించిన గుర్తింపు లభిస్తుందిపాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం పెరుగుతుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  వ్యాపారస్తులకు వారం మధ్య నుంచి అనుకోకుండా లాభాలువస్తాయి.  ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతిఉంటుంది. 

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ఈ వారం  ( ఏప్రిల్​ 13 నుంచి  ఏప్రిల్​ 19 వరకు) ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి:  ఈ రాశి వారికి ఈ వారం  కార్యక్రమాలు అన్ని  నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది.  మీరు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయండి.  ఇతరుల మాటలు నమ్మవద్దు.   ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.  కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. . కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన మేరకు లాభాలు వస్తాయి. 

కుంభరాశి:   ఈ రాశి వారికి ఈ వారం ఉద్యో గంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాల్లో అధికంగా లాభాలు వస్తాయి. బంధువుల తాకిడితో ఖర్చులు పెరుగుతాయి.  స్నేహితుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.  అయితే ఒక్కోసారి మీ ప్రమేయం లేకుండా మాటపడాల్సి వస్తుంది. అయినా నిరుత్సాహం పడవద్దు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మీనరాశి: ఈ రాశి వారికి  ( ఏప్రిల్​ 13 నుంచి  ఏప్రిల్​ 19 వరకు)  ఈ వారం  ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది.ఆదాయం బాగానే పెరుగుతుంది. అయితే బ్యాంకు లావాదేవీల విషయంలో... ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో దూసుకుపోతారు. వ్యాపారాలు కూడా బాగా లాభ సాటిగా కొనసాగుతాయి. వ్యాపారస్తులు కొత్త వెంచర్​ లు ప్రారంభిస్తారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.