వారఫలాలు: ఏప్రిల్​ 27 నుంచి మే 3 వరకు

వారఫలాలు: ఏప్రిల్​ 27 నుంచి  మే 3  వరకు

వారఫలాలు ( ఏప్రిల్​ 27 నుంచి మే 3 వరకు) : మేషరాశి వారు ఈ వారం   ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు.మిథునరాశి వారికి గతంలో ఉన్న  ఆర్థిక  ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  దీర్ఘ కాలంగా పెండింగ్​ సమస్యలు కొలిక్కి వస్తాయి.జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( ఏప్రిల్​ 27 నుంచి మే 3 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .  

మేషరాశి:   ఈ వారం( ఏప్రిల్​ 27 నుంచి మే 3 వరకు) ఈ రాశి వారికి అన్ని విషయాల్లో శుభ ఫలితాలుంటాయి. ఈ వారం  ఈరాశి వారు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు.  చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో వారం మధ్యలో నుంచి అనుకోని ఫలితాలు పొందుతారు.  ఉద్యోగస్తులకు .. సబార్డినేట్​ ల మద్దతు ఉంటుంది. కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు కలుగుతుంది.  . ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు బలపడతాయి. 

వృషభ రాశి:  ఈ రాశి కి ఈ వారం  కొన్ని ఒడిదఉడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.  ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆవేశానికి లోనుకాకుండా  ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  ఉన్నతాధికారుల నుంచి ఆశించిన సహకారం ఉండకపోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల వివాదాలు చికాకును కలిగిస్తాయి.  ఆర్థిక పరంగా ఖర్చు అధికమవుతుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  

మిథునరాశి:  ఈవారం మిథున రాశి వారికి కేరీర్​.. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలుంటాయి.  ఆర్థిక  ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  దీర్ఘ కాలంగా పెండింగ్​ సమస్యలు కొలిక్కి వస్తాయి.  ఉద్యోగస్తులకు ప్రశంశలు లభిస్తాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

కర్కాటకరాశి: ఈ రాశి వారికి ఈ వారం (ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు) మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపార విషయంలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్స్​ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సాఫీగా జీవనం కొనసాగిపోతుంది.  వ్యాపారస్తులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.  నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్​ అందుకుంటారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. 

సింహరాశి :  ఈ రాశి వారు ఈ వారంలో అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు దాపురిస్తాయి.  మీరు తీసుకొనే నిర్ణయం జీవితంలో టర్నింగ్​ పాయింట్​అవుతుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  అనుకోని ఖర్చులు రావడం.. బాధ్యతలు పెరగడం వంటి పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. వృత్తి నిపుణులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కూడబెట్టిన సంపద పెరుగుతుంది.
 
కన్యా రాశి:   ఈ వారం ( ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు) ఈ రాశి వారికి అన్ని విధాల కలసి వస్తుంది.  చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  సహోద్యోగుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  కేరీర్​ పరంగా ఊహించని మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

తులారాశి : ఈ వారం  ఈరాశి వారికి  ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ముఖ్యమూన వ్యవహారాల్లో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.   దుబారా ఖర్చులు పెరుగుతాయి.  అనుకున్న  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలకు  శ్రీకారం చుడతారు. జాబ్​ మారేందుకు ఇది అనుకూలమైన సమయంం.  వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

వృశ్చికరాశి:  ఈ రాశి వారు ఈ వారం ఇతరులతో సమయస్ఫూర్తిగా మెలగాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి.  ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తంగా ఉండండి. ప్రేమ.. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయండి సాగిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండంది.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. పెద్దల సలహాను ఆచరించేటప్పుడు అవి మీకు ఎంత వరకు ఉపయోగపడాతాయో చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ఈ వారం పని భారం పెరుగుతుంది.  గతంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు.  ముందు కొంత నిరుత్సాహం చెందినా.. ఆ తరువాత అది మీ మంచికే జరుగుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు.  మీ శత్రువులు మిమ్మలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.  చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  ఆఫీసులో ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు అందుకుంటారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  జీవితభాగస్వామిని సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.

మకర రాశి : ఈ వారం ... ఈ రాశివారికి  కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.  ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు.  బంధువుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది.  అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి.  ఇంట్లో సందడి వాతవరణం.. అధికంగా ఖర్చులు ఉంటాయి.  వ్యాపారస్తులకు  అంచనాకు మించి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అన్నీ విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీరే కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. 

కుంభ రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉండటం మంచిది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

మీన రాశి: ఈ వారం ఈ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఓ పని మీకు అనుకూలంగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.