వారఫలాలు (సౌరమానం) డిసెంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు

వారఫలాలు (సౌరమానం)  డిసెంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ  వరకు

ఈవారండిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకూ   జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశి కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది.  ధనస్సు రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలతో పాటు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మకరరాశి రాశి వారికి సమస్యలు పరిష్కారమవుతాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .

మేషరాశి:  ఈ రాశి వారు సంకల్ప బలంతో శుభ ఫలితాలు పొందుతారు.  కెరీర్​ పరంగా ఉన్నతస్థాయిని పొందుతారు.  ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.  ఆఫీసులో మీరు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  ఆర్థికంగా పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.  సమాజంలో గౌరవం.. కీర్తి పెరుగుతాయి. ప్రేమ ప్రపోజల్స్​ ఫలిస్తాయి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  వృత్తి జీవితంలో మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.  

వృషభ రాశి:  ఈ రాశి వారు ఈ వారం ( డిసెంబర్​ 8 నుంచి 14 వరకు) స్నేహితులతో ...బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండటంతో పాటు .. ఆదాయం పెరిగే  అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు ప్రశాంతంగా వారి పని వారు చేసుకుంటారు.  కార్యాలయాల్లో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  ప్రేమ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  వృషభ రాశి వారికి ఈ వారం.. డబ్బుకు ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. 

మిథున రాశి:  ఈ వారం మిథున రాశి వారు కొత్తగా ఆస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  నిరుద్యోగులకు ఆశించిన స్థాయి ఉద్యోగం రాకపోయినా... జాబ్​ వస్తుంది.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అప్పులు చేసే అవకాశం.. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.    వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి ఉంటుంది. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి  .... ఈ వారం.. అన్ని రంగాల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.  మొండి బకాయిలు వసూలవుతాయి.  ఇంటి నిర్మాణం మొదలు పెట్టే అవకాశం ఉంది.  వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చిరకాల కోరిక నెరవేరుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.  శుభకార్యాల్లో పాల్గొంటారు. 

సింహరాశి:  ఈ రాశి వారు  కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.   నిరుద్యోగులకు మంచి  ఆఫర్​ లు వచ్చే అవకాశం ఉంది.  ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం.  ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ వ్యవహారంలో సఖ్యత ఏర్పడుతుంది.

కన్యా రాశి:  ఈ రాశి వారు కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంటారు.  కొత్త వస్తువులు కొంటారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచచను వాయిదా వేసుకోండి.  ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.  ఆర్ధికంగాకొన్ని ఇబ్బందులు వచ్చినా.. సమయానికి డబ్బు అందుతుంది.  

తులా రాశి: ఈ రాశి వారికి ఈ వారం ( డిసెంబర్​ 8 నుంచి డిసెంబర్​ 14 వరకు) ఆదాయం బాగుంటుంది.  ఏ పని ప్రారంభించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.  వారం చివరిలో కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంటుంది. రియల్​ ఎస్టేట్​ రంగం వారికి అనుకోకుండా లాభాలు వస్తాయి. 

వృశ్చిక రాశి:   ఈరాశి వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  దూరపు బంధువులు పరిచయమవుతారు.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు రాశి:  ఈ రాశి వారు   ఈ వారం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో గౌరవం పొందుతారు.  ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది.  వారసత్వంగా వచ్చే ఆస్థి లభిస్తుంది.  వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలను  వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి:   ఈ రాశి వారు ఈ వారం ( ( డిసెంబర్​ 8 నుంచి 14 వరకు)  వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.  వారం మధ్యలో సమస్యలు పరిష్కారం అయి.. ప్రశాంతత ఏర్పడుతుంది,  జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది.  ఆర్థిక విషయంలోఎలాంటి మార్పులు ఉండవు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 

కుంభ రాశి : ఈ రాశి వారు ఆర్ధికంగా బలపడతారు.  మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది.  సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  వ్యాపారస్తులు మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.

మీన రాశి: ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. సభలు.. సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు విదేశీ జాబ్​ లభించే అవకాశం.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  వృత్తి .. వ్యాపారాల్లో   లాభాల పంట పండుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.