
వారఫలాలు ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) : మేషరాశి వారు ఈవారం డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథునరాశికి చెందిన వారు కొత్త వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు ..విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కన్యారాశి వారు తీసుకునే కొత్త నిర్ణయాలను అమలు చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. వృత్తి.. ఉద్యోగాల్లో ప్రశంసలు లభిస్తాయి.ధనస్సు రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి1వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ వారం మేషరాశి వారు చాలా బిజీగా గడుపుతారు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి సామాన్య లాభాలుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొంతవరకు పరిష్కరం అయ్యే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లోజోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ .. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ పరంగా బాధ్యతలు పెరగడంతో పాటు.. కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునే సమయంలో ఒత్తిడి పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు .. ప్రశంసలు లభిస్తాయి. అధికారులకు మీపై నమ్మకం పెరిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి.
మిథునరాశి: ఈ వారం ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు .. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగుకు ఆశించిన జాబ్ వస్తుంది. మిధున రాశికి చెందిన ఉద్యోగస్తులు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారుతుంది. కొన్ని కీలక విషయాల్లో మీ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. ..విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతుందని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటకం: ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండండి. పరిస్థితులకు తగిన విధంగా ఆలోచించండి.. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. ఆ తరువాత వాళ్లే రియలైజ్ అవుతారు. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. నిరుద్యోగులకు ఏ మాత్రం నిరుత్సాహ పడకండి. అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం ( ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) ముఖ్యమైన విషయాల్లో శ్రమ పడాల్సి వస్తుంది. వృత్తి .. వ్యాపారాల్లో పనిభారం పెరిగినా... ఆశించి ప్రతిఫలం దక్కే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారు గుడ్ న్యూస్ వింటారు.
కన్యా రాశి: ఈ వారం ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త నిర్ణయాలను అమలు చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. వృత్తి.. ఉద్యోగాల్లో ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగత్తగా ఉండాలి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తులారాశి: ఈ రాశి వారు వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. మీరు చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నగదు చెల్లించే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వారం జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృశ్చికరాశి: ఈ వారం వృశ్చిక రాశి వారు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి పనికి కొద్దిగా శ్రమతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి జాబ్ లభించే అవకాశం ఉంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు.ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి1 వరకు) చేపట్టిన పనులు విజయవంతంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యో గంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాల్లో అధికంగా లాభాలు వస్తాయి. బంధువుల తాకిడితో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నతాధికారులతో మీ ప్రమేయం లేకుండా మాట పడాల్సి వస్తుంది. సహనంతో ఉండండి.కుటుంబ సభ్యుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు బాగా ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. ఏమాత్రం నిరుత్సాహ పడకండి మిమ్మలను కాదనుకున్న వారే మీ దగ్గరకు కాళ్ల బేరానికి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి ( ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) వృత్తి.. వ్యాపారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలతో ఆశించిన ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్ధిక పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ప్రేమ , పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు.