వారఫలాలు (సౌరమానం) ఫిబ్రవరి 2 వతేది నుంచి ఫిబ్రవరి 8వ తేది వరకు

వారఫలాలు (సౌరమానం) ఫిబ్రవరి 2 వతేది నుంచి ఫిబ్రవరి 8వ తేది వరకు

ఈవారం ఫిబ్రవరి 2 వ నుంచి  ఫిబ్రవరి 8 వ తేదీ వరకూ  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మేష రాశికి చెందిన ఉద్యోగస్తుల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. .  మిధునరాశికి చెందిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కర్కాటక రాశి వారికి పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  మకరరాశి రాశివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.   జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం  (  ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి8 వరకు) 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .

మేషరాశి: ఈ రాశి వారికి  ఈ వారం ( ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు)  మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. అన్ని పనులు పూర్తవుతాయి.   ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో సెంటర్​ ఆఫ్​ ఎట్రాక్షన్​ గా నిలుస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఇక ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగిపోతాయి. బిజినెస్​ చేసే వారు లాభాల బాటను కొనసాగిస్తారు.  రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి ఆలోచనలు తీసుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసివస్తాయి.  

వృషభ రాశి:  ఈ రాశికి చెందిన వారు ఫిబ్రవరి 2 నుంచి 8 వతేదీ వరకు చాలా శుభంగా ఉంటుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఎవరి మాటలు వినకుండా మీపని మీరు చేసుకోండి.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని .. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక్కోసారి అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వారం చివరిలో శుభవార్త వింటారు.  వ్యాపారస్తులు కొద్దిపాటి లాభాలు పొందుతారు.  చేతివృత్తుల వారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి పెరుగుతుంది.  

మిధున రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి.  వారం మధ్యలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని పండితులు చెబుతున్నారు.  నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. 

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారం ( ఫిబ్రవరి 2 నుంచి 8 వ తేది వరకు) అన్ని విధాలా బాగుంటుంది.  బిజినెస్​ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్తగా పెట్టబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది.  ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు గుడ్​ న్యూస్​ వింటారు.గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.   ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారు మీరు చేయు వృత్తిలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో.. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కోర్టు వ్యవహారాలు కలసివస్తాయి.  కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం జీవితం సాఫీగా సాగిపోతుంది.   

కన్యారాశి:  ఈ రాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఒక్కోసారి డబ్బు లెక్కపెట్టేందుకు టైం సరిపోదా అన్నట్లు ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరు ఏమనుకున్నా.. మీ పని మీరు చేసుకోండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.  వారం చివరిలో  మీ దగ్గరికే అందరూ వస్తారు. వారం చివరిలో అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావచ్చు.  ఇక ఆర్థికంగా కొంత ఆందోళన కలిగినా.. సమయానికి డబ్బు అందుతుంది.  ప్రేమ.. పెళ్లి ఆలోచనలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి.  ఎలాంటి ఆలోచన లేకుండా దైవ ధ్యానంలో గడపండి.. అంతా మంచే జరుగుతుంది. 

తులారాశి :  ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులు గుడ్​ న్యూస్​ వింటారు. కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఈ వారం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. చేతి వృత్తుల  వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి.  మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి అన్ని విధాల బాగుంటుంది.  కాని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. శత్రువుల విషయంలో విజయం సాధిస్తారు. ప్రేమ ... పెళ్లి వ్యవహారాల విషయాలను  వాయిదా వేసుకోండి. చేతివృత్తుల వారు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.  పిల్లల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కుటుంబసభ్యులతో వాదనలు పెట్టుకోకండి.. ఏదైనా మాట్లాడాల్సి వస్తే ముక్తసరిగా మాట్లాడి సమయస్ఫూర్తిని పాటించండి.. చివరకు అంతా మంచే జరుగుతుంది. 

ధనస్సురాశి:  ఈరాశి వారికి ఈ వారం (ఫిబ్రవరి 2 నుంచి 8 వ తేది వరకు) కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో  గొడవలు ఏర్పడే అవకాశం ఉంది.  ఎలాంటి విషయాల్లో అవసరానికి మించి మాట్లాడవద్దు. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.  నిరుత్సాహం పడకుండా మీ పని మీరు చేసుకోండి.  మధ్య మధ్య మానసికంగా కొంత ఆందోళన కలుగుతుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండావదిలేయండి . అంతా మంచే జరుగుతుంది. 

మకర రాశి:  ఈ రాశి వారు ఈ వారం.. ఉల్లాసంగా .. ఉత్సాహంగా గడుపుతారు.  పెళ్లికోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆవేశాన్ని తగ్గించుకుని .. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది.  కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది.  బిజినెస్​ చేసే వారికి అన్ని విధాలా కలసి వస్తుంది.  ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. 

కుంభ రాశి:  ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా.. సంతృప్తిగానే గడుపుతారు.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు వారం చివరిలో కలసి వస్తాయి.  ఎవరితోను ఎక్కువ మాట్లాడవద్దని పండితులు అంటున్నారు.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వారం మొదట్లో కొంత ఆందోళన కలిగించినా.. వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది. 

మీన రాశి: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి.  వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆర్థికంగా బలపడినా.. ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.  వ్యాపారస్తులకు లాభం లేకపోయినా నష్టం మాత్రం ఉండదు. కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  నిరుత్సాహం పడకుండా మీ పని మీరు చేసుకోండి.  అంతా మంచే జరుగుతుంది.