వారఫలాలు (సౌరమానం) ఫిబ్రవరి 9 వతేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు

వారఫలాలు (సౌరమానం) ఫిబ్రవరి 9 వతేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు

  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఫిబ్రవరి 9 వ తేది  నుంచి  ఫిబ్రవరి 15 వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వృషభరాశికి చెందిన ఉద్యోగస్తుల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో కూడా ఓర్పు సహనంతో ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.   సింహరాశికి చెందిన వారికి ఊహించని పురోగతితో పాటు  నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.   జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం  (  ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి15 వరకు) 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .

మేషరాశి: ఈ రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు అన్ని విధాల అనుకూలంగా ఉంది.  మీ ఆలోచనలు.. నిర్ణయాలు అనుకున్న పనులను 
నెరవేరుస్తాయి.  నిరుద్యోగులకు ఊరట కలగడంతో పాటు ఆశించిన జీతం లభిస్తుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో చర్చించి ఒక ఆలోచన తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​వచ్చే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. పెళ్లి సంబంధాల కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ప్రేమ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.  

వృషభ రాశి:  ఈ రాశి వారికి  ఫిబ్రవరి నెల రెండోవారంలో అనగా 9 వ తేది నుంచి 15 వరకు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వృత్తి.. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది.  ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృషభరాశి వారికి చెందిన వారు చాలా కాలంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు. పాత బకాయిలు వసూలవడం.. ఆస్తివివాదాలు పరిష్కారం కావడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  కొత్త వస్తువులుకొనే అవకాశం ఉంది. పిల్లల విషయంలో సంతృప్తికర ఫలితాలుంటాయి. 

మిథున రాశి: ఈ రాశి వారు  ఉన్నతస్థాయికి చేరేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  కుటుంబసభ్యుల మధ్య వివాదాల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది.  ఉద్యోగస్తులు రివార్డులు.. అవార్డులు అందుకుంటారు.  అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి.నిరుద్యోగులకు విదేశాల నుంచి  ఆఫర్లు అందే అవకాశముంది. అదనపు ఆదాయం కోసం  ఎక్కువగా శ్రమ పడతారు. 

కర్కాటక రాశి:  ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా ఓర్పు సహనంతో ఉండాలని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.   ఇంటా బయట అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలపరంగా నూతనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి ..వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా... పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్నా వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారికి ఊహించని పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అదనపు ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసర జోక్యాలు వద్దని పండితులు సూచిస్తున్నారు.వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగస్తులకు మిశ్రమఫలితాలుంటాయి. 

కన్యారాశి:  ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో కీర్తి.. గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తుల జీవితం సానుకూలంగా సాగిపోతుంది.   వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి.  ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

తులారాశి:ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ వారం పనిభారం పెరిగే అవకాశం ఉంది.  మీకు అప్పగించిన పనిని సమర్దవంతంగా నిర్వహిస్తారు. అన్నదమ్ముల మధ్య ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త గా వ్యవహరించండి. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశాలున్తానాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది.  వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు  ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

వృశ్చికరాశి:  ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు కొద్ది లాభాలతో పురోగతి చెందుతాయి.ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి.. మీ సామర్ధ్యం  కారణంగా పని భారం పెరుగుతుంది. ఆర్థికలావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించ గలుగుతారు. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్త వుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. 

ధనస్సురాశి: ఈ రాశి వారు తలపెట్టే కొత్త ప్రయత్నాలకు... కొత్త నిర్ణయాలకు అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. . దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు  అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.  ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. 

మకరరాశి:  ఈ వారం ( ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు) ఈ రాశి వారికి  ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా
తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా, అనుకూలంగా సాగిపోతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. పెళ్లిప్రయత్నాలు ఫలిస్తాయి. విహార యాత్రలకు ప్లాన్​ చేస్తారు. 

కుంభరాశి:  ఈ వారం కుంభరాశి వారు అనుకున్న పనులు నెరవేరుస్తారు. వ్యాపార  విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల విషయాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణ యాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనరాశి:  ఈరాశి వారికి ఈ వారం అన్ని వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఈ వారం బాగుంటుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వాహనయోగం ఏర్పడుతుంది. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.