జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ( జనవరి 19 నుంచి 25 వరకు) ఈవారం మేషరాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. కన్యారాశి వారు చేపట్టిన పనులు నిలకడగా సాగుతాయి..వృశ్చిక రాశి వారికి పనిభారం పెరిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. మిగతా రాశుల వారికి ఎలా ఉంది.. ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో 12 రాశుల వారి వివరాలు తెలుసుకుందాం. . .
మేష రాశి: ఈ వారం జనవరి 19 నుంచి 25 వరకు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరీర్ నిమిత్తం విదేశాలకు వెళ్లేఅవకాశం ఉంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే అదనపు ఖర్చులు ఉంటాయి.
వృషభ రాశి: ఈ వారం వృషభరాశి వారు కెరీర్ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారం చివరిలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ, పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మిధున రాశిః ఈ రాశికి ,చెందిన ఉద్యోగస్తులు ఎవరితోను వాదనలు పెట్టుకోకండి. చాలా సైలంట్ గా మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు లాభం లేకపోయినా నష్టం ఉండదు.కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు ప్రతి విషయంలోనూ కష్టపడాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం జనవరి 19 నుంచి 25 వరకు చాలా అద్హుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో సనిచేసే వారు కొన్ని అవార్డులు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ వారం కర్కాటక రాశి వారికి అన్ని విధాలాఅనుకూలంగా ఉంటుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. నిరాశ పడకండి. మీరు తలపెట్టిన పనుల్లో మొదట ఆటంకం ఏర్పడినా చివరకు మీరే విజయం సాధిస్తారు. మీ పట్టుదలే మీ విజయానికి సోపానం. వ్యాపారస్తులు.. ఉద్యోగస్తులు.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికం అవుతుంది. పెళ్లి.. ప్రేమ విషయాలు మధ్యస్తంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ రాకపోయినా ఉద్యోగం మాత్రం లభిస్తుంది.
కన్యారాశి: ఈ వారం కన్యారాశి వారు చేపట్టిన పనులు నిలకడగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బలపడతారని పండితులు సూచిస్తున్నారు. కొత్త ఆలోచనలు.. కొత్త నిర్ణయాలు కలసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది.
తులారాశి: ఈ రాశి వారు జనవరి 19 నుంచి 25 వరకు వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వారం చివరిలో కొన్ని అదనపు ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు జనవరి 19 నుంచి 25 పనిభారం పెరుగుతుంది. కార్యాలయంలో గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. అయితే కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. వారం చివరిలో కొన్ని అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. విదేశీ ప్రయాణం కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు.
ధనస్సు రాశి: ఈ వారం ధనస్సు రాశి వారు అనుకున్న పనులు నెరవేరతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగి .. కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్ధికంగా కొద్ది మేరకు బలపడతారు. అనుకోకుండా దూరపు ప్రయాణం చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు. అధికారులు, పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. పూర్వీకుల ఆస్తి చేతికి రావడంతో కొన్ని అప్పులు తీరుతాయి.
మకర రాశి: ఈ రాశి వారికి మంచి పరిచయాలు ఏర్పడుతాయి. పెళ్లి కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. ఉద్యోగస్తుల జీవితం
సంతృప్తికతరంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తి కరంగా సాగుతాయి. గతంలో రావాల్సిన బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలనుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆశించిన హోదా దక్కుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి బంధువర్గంలోని వారితోనే అనుకోకుండా సంబంధం కుదరురుతుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టబడులు పెట్టేందుకు మంచి సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది.చేతి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లను చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉంది.. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది.