జనవరి 5 నుంచి 11 వరకు రాశి ఫలాలు: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈవారం మిధురాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. కన్యారాశి.. పనిభారం అధికం కావడం..వృశ్చిక రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయని పండితులు సూచిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంది.. ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో 12 రాశుల వారి వివరాలు తెలుసుకుందాం. . .
మేషరాశి : ఈ రాశి వారికి ఈ వారం ( జనవరి 5 నుంచి 11 వరకు) సమాజంలో గౌరవం పొందుతారు. ఆస్తుల వ్యవహారంలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణుల ద్వారా తెలుస్తుంది. ఉద్యోగస్తులు .. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఆదాయం కొద్ది మేరకు పెరిగే అవకాశం ఉంది.. శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు. ప్రేమ వ్యవహారం బలపడుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
వృషభ రాశి : ఈ వారం వృషభ రాశి వారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి.. వ్యాపారాల్లో.. అనుకోని లాభాలుంటాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అయితే ఈ వారం చివరిలో అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
మిధున రాశి: ఈ వారంలో మిధున రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అనుకోకుండా పూర్వీకుల ఆస్థి కలిసి వస్తుంది. అయితే ఈ వారం మిథున రాశి వారు బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు.. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలుంటాయి. ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోకండి. అంతా మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితిలో మార్చుకోవలసివస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా విందు.. వినోదాల్లో పాల్గొంటారు.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొంతమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయి. కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. వృత్తి .. వ్యాపారాలు నిరాటకంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికం కావడంతో కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని శుభకార్యాలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కన్యా రాశి: ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. పని భారం.. ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంటుంది. బైక్ డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి. కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో ఉపశమనం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగాలాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలించడంతో నూతనోత్సాహం ఏర్పడుతుంది.
తులా రాశి: ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అధికంగా లాభాలు పొందుతారు. అయితే శతృవుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. మీతో మాటలు కలిపి..ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనిపై దృష్టి పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు వారం మధ్యలో నుంచి లాభాలు గడిస్తారు.ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్నికారణాల వలన స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ప్రేమ .. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. పెండింగ్ సమస్యల గురించి ఆలోచించకండి..
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈవారంలో ( జనవరి 5 నుంచి జనవరి 11 వరకు) ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ముందు మీకు అసంతృప్తి కలిగించినా.. తరువాత మంచే జరుగుతుంది. వ్యాపారస్తులు.. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు తమ వంతు ప్రయత్నాలను సఫలం చేసుకుంటారు.
ధనస్సు రాశి: ఈ వారం ధనస్సు రాశి వారికి పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. ఎలాంటి అసంతృప్తికి లోనుకాకండి. చివరకు మీరే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు .. ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు వారం మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు .. ఈ వారం మంచి ఫలితాలుంటాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారు మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. బంధువులు.. స్నేహితులతో కలిసి ఎంజాయి చేస్తారు. జీవితభాగస్వామి ప్రోత్సాహం పుష్కలంగా ఉంటుంది.
మకర రాశి: ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది. పెండింగ్ లో ఉన్నసమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. అనుకున్న సమయానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువుల తాకిడి ఎక్కువుగా ఉండటంతో ఖర్చులు పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి.. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. సహోద్యోగులతో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెళ్లి ప్రస్తావన వాయిదా వేసుకోమని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి : ఈ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రభుత్య ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో ఉన్న వివాదాల గురించి ఆలోచించకండి. . మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. . వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.