ఈవారం జనవరి 26 వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకూ జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారి మాట విలువ పెరగడంతో పాటు సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి వారు కొత్తగా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మకరరాశి రాశికి చెందిన ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు) 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . .
మేషరాశి : ఈ వారం ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు) మేష రాశి వారు చాలా బిజిబిజీగా గడుపుతారు. మీరు తయారు చేసుకున్న ప్లాన్ ను సమర్దవంతంగా అమలు పరుస్తారు. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి సంబంధం కుదురుతుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే.. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టబడుల ఫలితం ఇప్పుడు కనపడుతుంది. వారం చివరిలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి: ఈ వారం వృషభరాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగుల విషయం మార్పులు.. చేర్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆదాయ పరంగా అంచనాలకు మించి రాబడి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అనుకోకుండా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి: ఈ రాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. అయినా పట్టుదలతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆస్తి వివాదాల విషయంలో పరిష్కార దిశగా చర్చలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు లాభాల బాటలో ఉంటారు. కాని కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.కొత్తగా వాహనం కొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. వృత్తి.. వ్యాపారులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో.. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేందుకు ప్రక్రియ మొదలవుతుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ఆదాయంతో పాటు.. ఖర్చులు కూడా పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఈ వారం ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు) సింహరాశి వారు ఉల్లాసంగా .. ఉత్సాహంగా గడుపుతాయిరు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను పూర్తి చేసే విషయంలో మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. చివరకు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ప్రేమ వ్యవహారంలో అన్యోన్యత పెరుగుతుంది. . వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి.
కన్యారాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల విషయంలో పట్టుదలతో ప్రయత్నాలు చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. ఉద్యోగులు కొంత ఆందోళనతో గడపాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనుల విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు కొద్దిగా లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సలహా ఇస్తున్నారు. ఇల్లు మారే అవకాశం ఉంది.
తులారాశి: ఈ రాశి వారు ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు) ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. . వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలు అనుకూలంగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. . నెట్‌వర్కింగ్ లో పనిచేసే వారికి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి.. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థికంగా అభివృద్ది చెందినా.. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారంతో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి కోసం ఎదురుచూసే బంధువర్గంలోనే సంబంధం కుదురుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈవారం దూరపు బంధువులు కలవడంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్తగా వాహనాలు.. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు హోదా పెరిగే అవకాశం ఉంది. కుటంబసమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు వారం మధ్యలో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు అదనపు భారం ఏర్పడినా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆలోచించి... పెద్దలను సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తే మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వారం చివరిలో అనుకోకుండా ఖర్చులు ఏర్పడుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ వారం ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2వరకు) అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇంత వరకు ఎంతో భారమనుకున్న పనులను తేలికగా పూర్తి చేస్తారు. మీ సమర్థతపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రమోషన్ రావడంతో పాటు.. అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని విలువైన వస్తువులు కొంటారు. బ్యాంకు విషయాల్లో అప్రమత్తంగా ఉండంది. సాధ్యమైనంతవరకు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు జరపవద్దు.
మీనరాశి : ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలతో పాటు, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు హోదాతో పాటు పనిభారం బాగా పెరుగుతుంది. ఎంప్లాయీస్ కు .. సహోద్యోగుల సహకారం పుష్కలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి పనుల వారు చాలా బిజీగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో.. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ.. పెళ్లి విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి.