వారఫలాలు ( సౌరమానం) జులై 14 నుంచి 20 వరకు

వారఫలాలు ( సౌరమానం) జులై 14 నుంచి 20 వరకు

మేషం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహం. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని ఆసక్తి కర విషయాలు తెలుస్తాయి. వారారంభంలో ప్రయాణాలు వాయిదా. 

వృషభం : రాబడి సంతృప్తినిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలలో  లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. అయినా సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు.

మిథునం : కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలకు కార్యరూపం. విద్యార్థుల ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు కాస్త అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు. పెట్టుబడులు కాస్త ఆలస్యం. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు గుర్తింపు. క్రీడాకారులు, పరిశోధకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు.

కర్కాటకం : ఆర్థిక విషయాలు కొంత అనుకూలిస్తాయి. ఒక కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కళాకారులకు ప్రయత్నాలు కొంత సఫలం. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

సింహం : ఆదాయం సంతృప్తినిస్తుంది. వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాలలో కదలికలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. వివాహాది యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు కాస్త అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో దూరప్రయాణాలు.

కన్య : కొన్ని ముఖ్య నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. ఇంతకాలం పడిన కష్టానికి కొంత ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. విద్యార్థులు  సత్తా చాటుకునే సమయం. వ్యాపారాల విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల శ్రమ ఫలిస్తుంది. వారారంభంలో వృథా ఖర్చులు.

తుల : మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారమే అన్నట్లుంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, క్రీడాకారులకు కాస్త ఊరట. వారారంభంలో వృథా ఖర్చులు.

వృశ్చికం : అనుకున్న కార్యాలు విజయవంతం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాల సర్దుబాటు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవర్గాలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు. కళాకారులకు నిరాశ తొలగుతుంది.

ధనస్సు : ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. జీవితంలో మరపురాని సంఘటన ఎదురవుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వ్యాపారాలలో పురోగతి. ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పరిస్థితులు కాస్త అనుకూలం. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొత్త అవకాశాలు. వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

మకరం : అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి. ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. వ్యాపారాలలో ముందడుగు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలు, కళాకారులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. వారారంభంలో శ్రమ పెరుగుతుంది.

కుంభం : రాబడి ఆశాజనకం.  అంచనాలు నిజం కాగలవు. కార్యసాధన దిశగా ముందుకు సాగుతారు. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులకు కాస్త ఊరట లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తల అంచనాలు కొన్ని నిజమవుతాయి.

మీనం : ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా  మారతారు. కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. మీ నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. కళాకారులు, పరిశోధకులకు అనుకూలం.

వక్కంతం చంద్రమౌళి  జ్యోతిష్య పండితులు ఫోన్​: 98852 99400