వారఫలాలు ( సౌరమానం) జులై 21 నుంచి 27 వరకు

మేషం : కుటుంబసమస్యలు తీరతాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు స్నేహితులు సహకరిస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇల్లు లేదా  వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఊహించని హోదాలు. పారిశ్రామికవేత్తలు ఉత్సాహవంతంగా గడుపుతారు,  విదేశీ పర్యటనలు ఉంటాయి.

వృషభం : స్నేహితులు అన్ని విధాలా సహకరిస్తారు. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనసౌఖ్యం. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. వ్యాపారులకు విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని మరిన్ని అవకాశాలు రావచ్చు. 

మిథునం : ఆదాయం తగ్గినా అవసరాలకు ఢోకా ఉండదు. అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి. భూమి, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. 

కర్కాటకం : పట్టింది బంగారమే. ఎంతటి వారినైనా మీవైపు ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వివాహ, ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు.

సింహం : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. శుభకార్యాలపై కుటుంబంలో చర్చలు జరుపుతారు. 
నిరుద్యోగులు ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు తీరతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ఉన్నతస్థితి రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వీరికి విశేష గుర్తింపు లభిస్తుంది.

కన్య : చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం ఆశాజనకం. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. సోదరులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకం.

తుల : ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. రాబడి సంతృప్తికరం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు స్నేహితులుగా మారతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారులకు లాభాలు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం : ఆదాయానికి మించిన ఖర్చులు. కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు నూతనోత్సాహం. కళాకారులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు రావచ్చు.

ధనస్సు : మీ అంచనాలు ఫలించే సమయం. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. అందరిలోనూ ప్రశంసలు పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు తగినంతగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

మకరం : కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం కొంత ఊరటనిస్తుంది. సన్నిహితుల నుంచి మాటసాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. భూసంబంధిత వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఊహించని ఆహ్వానాలు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారుల కృషి ఫలిస్తుంది.

కుంభం : ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం. ప్రముఖుల పరిచయం. చిరకాల కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనసౌఖ్యం. ముఖ్య వ్యవహారాలలో చర్చలు సఫలం. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం. కళాకారులకు పురస్కారాలు.

మీనం : బంధువులు,స్నేహితుల నుంచి  సాయం అందుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. విద్యార్థుల యత్నాలు కొంత ఫలిస్తాయి. ఆలోచనలు కొంతవరకూ కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో పురోగతి. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగులకు అనుకూల బదిలీలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400