రాశిఫలాలు : 2024 జూన్ 2 నుంచి జూన్ 8 వరకు

రాశిఫలాలు :  2024 జూన్ 2  నుంచి జూన్ 8 వరకు

మేషం : పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యుల ప్రేమాభిమానాలు పొందుతారు. కొన్ని సమస్యలు పట్టుదల, నేర్పుతో పరిష్కారమవుతాయి. వాహనసౌఖ్యం. ప్రముఖుల పరిచయాలు. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని సన్మానాలు. వారారంభంలో దూరప్రయాణాలు.

వృషభం : కొన్ని సమస్యలు పరిష్కారం. మీ ఆశయాలు నెరవేరతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి. ఎట్టకేలకు  కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. ఆలోచనల అమలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు మీపట్ల సానుకూలంగా ఉంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు మానసిక ప్రశాంతత.  వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు .

మిథునం : ఊహించని రాబడి. అప్పులు తీరతాయి. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశయాలు నెరవేరతాయి. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు వస్తాయి. మీ నిర్ణయాలను అందరూ ప్రశంసిస్తారు. ప్రముఖుల పరిచయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఊహలు నిజం కాగలవు.

కర్కాటకం : ముఖ్యమైన కార్యాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం సంతృప్తికరం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కారం. అరుదైన ఆహ్వానాలు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ప్రముఖులు పంపిన సందేశంతో ఊరట చెందుతారు.  వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీయానం. వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

సింహం : ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కొత్త కార్యాలకు శ్రీకారం. వివాహాది వేడుకల నిర్వహణలో పాల్గొంటారు. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతం. ఇంట్లో శుభకార్యాలు నిర్వ హిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారులు పెట్టుబడులు సమకూరి ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు.

కన్య : రాబడి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చే ఫలితాలు అందుతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు కొన్ని లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు. 

తుల : ముఖ్యమైన కార్యాల్లో స్వల్ప ఆటంకాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ముఖ్య నిర్ణయాలు వాయిదా. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం తగ్గినా అవసరాలకు లోటు ఉండదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు లాభాలు దక్కినా చికాకులు తప్పకపోవచ్చు.  ఉద్యోగులకు విధుల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. కళాకారులకు నిరుత్సాహం. వారారంభంలో విందులు, వినోదాలు. వస్తులాభాలు.

వృశ్చికం : కార్యక్రమాలలో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు దక్కే ఛాన్స్‌. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. విద్యార్ధులకు అనుకున్న అవకాశాలు. వాహన, కుటుంబ సౌఖ్యం. వ్యాపారులకు నూతనోత్సాహం, కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రాజకీయవేత్తలకు ఊహించని సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. 

ధనస్సు : రావలసిన సొమ్ము అందడంతో ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరే సమయం. చేపట్టిన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాలు, వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తోడు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉత్సాహవంతంగా ముందుకుసాగి గుర్తింపు పొందుతారు.

మకరం : అదనపు రాబడి. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు  కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయం. కొత్త వాహనాలు కొంటారు. వ్యాపారులకు మరింత ఉత్సాహం. భాగస్వాముల సహకారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. 
రాజకీయవేత్తలకు ఆదరణ పెరుగుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ప్రయాణాలు .

కుంభం : కొత్త కార్యాలు సకాలంలో  పూర్తి. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. మీ ఆలోచనల అమలుకు కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు, పెట్టుబడులు సమకూరి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు. వారాంతంలో దూరప్రయాణాలు.

మీనం : ఆదాయం ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వేడుకలు నిర్వహిస్తారు. అందరిలో గౌరవం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్య కార్యాలు విజయవంతం. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400