వారఫలాలు: మార్చి 16 వతేది నుంచి మార్చి22 వ తేది వరకు

వారఫలాలు:   మార్చి 16 వతేది నుంచి మార్చి22 వ తేది వరకు

వారఫలాలు (మార్చి 16 వతేది నుంచి మార్చి22 వ తేది వరకు) : మేషరాశి ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులకు అన్ని  విధాలా కలసి వస్తుంది. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. వృషభ రాశి  వారికి ఈ వారం  గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వృత్తి ... వ్యాపారాల్లో శ్రమ అధికం అవుతుంది.సింహరాశివారు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు.  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మకరరాశి వారు చేపట్టిన కొత్త పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు కాల్​ లెటర్స్​ అందుకుంటారు. మేష రాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం (మార్చి 16 వతేది నుంచి మార్చి22 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .

మేషరాశి:  ఈ వారం మేషరాశివారి జీవితంతో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.  మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులకు అన్ని  విధాలా కలసి వస్తుంది.  ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. సినీ రంగంలోని వారికి ఈ  వారం కలసి వస్తుంది. ప్రేమ సంబంధాలకు శుభ సమయం కాదు. ప్రతికూల పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. 

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం  ఉద్యోగ జీవితం సంతృప్తికరంగానే సాగిపోతుంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వృత్తి ... వ్యాపారాల్లో శ్రమ అధికం అవుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది.  ప్రేమ, పెళ్లి  వ్యవహారాల్లో  ఆశించిన స్పందన లభిస్తుంది.  ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.   

మిథునరాశి:ఈ వారం  ( మార్చి 16 వతేది నుంచి మార్చి22  వ తేది వరకు)  మిథున రాశి వారి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. అదనంగా ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

కర్కాటక రాశి:   ఈవారం కర్కాటక రాశి వారు సంతోషకరమైన వార్తలు వింటారు. మీ నిర్ణయం సంతానం భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు.   వివాహయత్నాలు ఫలిస్తాయి.   ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులు పెరిగినా సమయానికి చేతికి డబ్బు అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఆదాయం లభించే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం ( మార్చి 16  నుంచి 22 వరకు) ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు.  మీ ప్లాన్​ ప్రకారం పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆనందంగా ఉంటారు.  మాటతీరులో మెండితనం ఉండకుండా చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కన్యా రాశి:  ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ వ్యహారాలు సాఫీగా సాగిపోతాయి. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఈ వారం ఏపని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం పెరుగతుంది. ఖర్చులు కూడా అలానే పెరగుతాయి. ఉద్యోగస్తులకు..వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. స్వయం ఉపాధి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. 

తులారాశి:  ఈ రాశి వారికి ఈ వారం  గ్రహబలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అనవసనంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు.

వృశ్చికరాశి:  ఈ రాశి వారు ఈ వారం కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. వృత్తి .. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ, సమర్థత మరింతగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.  కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ధనుస్సు రాశి:   ఈ రాశి వారి ఈ వారం ( మార్చి 16 నుంచి 22 వరకు) పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి తినకపోవడం, అనవసరమైన ఆలోచనల కారణంగా నిస్పృహతో ఉంటారు. వారాంతంలో శుభవార్త వింటారు.వ్యాపారులకు మంచి సమయం. నూతన ఒప్పందాల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 16  వతేది నుంచి మార్చి22 వ తేది వరకు) చేపట్టిన కొత్త పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు కాల్​ లెటర్స్​ అందుకుంటారు.  ఉద్యోగస్తులకు చికాకులు.. ఇబ్బందులు ఏర్పడుతాయి. వారం చివరిలో అంతా మంచే జరుగుతుంది.  ఎలాంటి ఆందోళన పడకుండా మీ పని మీరు చేసుకోంది.  కొత్త ఆలోచనలకు కార్యరూపం దాల్చుతారు. . వ్యాపారాలు సజావుగా సాగుతాయి... ప్రేమ.. పెళ్లి విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

కుంభరాశి: ఈ రాశి వారికి  ఈ వారంలో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.. సమాజంలో గౌరవం కీర్తి పెరిగే అవకాశం ఉంది.  ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది.  ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు అతి కొద్ది లాభాలు వస్తాయి.  ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. . ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.  ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

మీనరాశి: ఈ రాశి వారికి  ఈ వారం మంచి ఆలోచనలు కలుగుతాయి. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడతారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వారం మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడతాయి పెద్దల సహకారంతో కొన్నిపరిష్కరించుకుంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.  వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూ లంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరమని జ్యోతిష్యనిపుణులు సూచిస్తున్నారు.