
వారఫలాలు (మార్చి 23 వతేది నుంచి మార్చి30 వ తేది వరకు) : మిధునరాశి వారికి ఈవారం ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి.. వ్యాపారస్తులకు డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. సింహరాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించే అవకాశం ఉంది.ధనుస్సు రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మేష రాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం (మార్చి 23 వతేది నుంచి మార్చి30 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) సహోద్యోగుల నుంచి సహకారం బాగుంటుంది. ఏ విషయాన్నైనా జీవితభాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మొదట్లో ఇబ్బంది కలిగించినా చివరిలో సుఖాంతంగా ఉంటాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో కొంత శ్రద్ద చూపించాలి.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగ .. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా బాధ్యతలు పెరగడంతో పాటు.. కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునే సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు వస్తాయి
మిథునరాశి: ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి.. వ్యాపారస్తులకు డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికి.. సంతృప్తికరంగానే ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటకం: ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండండి. పరిస్థితులకు తగిన విధంగా ఆలోచించండి.. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. ఆ తరువాత వాళ్లే రియలైజ్ అవుతారు. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. నిరుద్యోగులకు ఏ మాత్రం నిరుత్సాహ పడకండి. అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు... వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారు గుడ్ న్యూస్ వింటారు.
కన్యా రాశి : ఈ రాశి వారు ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. గతంలో ఆగిన పనుల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు వారం మధ్యలో గుడ్ న్యూస్ వింటారు. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పండితులు చెబుతున్నారు.
తులారాశి: ఈ రాశి వారు ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతుంది. కొత్తగా గృహ నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో జీవితభాగస్వామి సలహా తీసుకోండి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. . వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. అయితే మిత్రులతో చర్చించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనుల్ని కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన సొమ్మును, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 23 నుంచి 30 వరకు) చేపట్టిన పనులు విజయవంతంగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు.వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారమంతా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభి స్తుంది.. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగు లకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది.వ్యాపారాల్లో అధికంగా లాభాలు వస్తాయి. బంధువుల తాకిడితో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నతాధికారులతో మీ ప్రమేయం లేకుండా మాట పడాల్సి వస్తుంది. కొంతమంది మీ పనులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఈ వారం మీ ఆశయం నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఈ వారంలో నిరుద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.
మీనరాశి: ఈ రాశి వారు ( మార్చి 23 నుంచి 30 వరకు) ఈ వారం ఆర్థిక లావాదేవీలు.. ఉచిత సహాయాలకు దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు, ఉద్యోగస్తులు పని భారం పెరగడంతో సతమతమవుతారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వృత్తి పనుల వారు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక వ్యహారాల్లో కొందరి మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ , పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు.