
వారఫలాలు (మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) : మేషరాశి వారికి ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. . వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ... వృత్తి పని వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యవహారంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సింహరాశివారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మకరరాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మకుండా.. మీ నిర్ణయాన్ని అమలు చేయండి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ వారం మేషరాశి వారు లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని విషయాలను చూసి చూడనట్లు వదిలేయండి. ఉద్యోగులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా..మీ పని మీరు చేసుకోండి. విమర్శలకు స్పందించవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ... వృత్తి పని వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ప్రతి వ్యవహారంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు .. ప్రశంసలు లభిస్తాయి. అధికారులకు మీపై నమ్మకం పెరిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.
మిథునరాశి: ఈ వారం (మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) మిథున రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఇప్పటి వరకు వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కర్కాటకం: ఈ వారం (మార్చి 2 వతేది నుంచి మార్చి8వ తేది వరకు) కర్కాటక రాశివారికి మంచి ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉండే వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులు కెరీర్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన చేయవచ్చు. అసంపూర్ణ పనులను పూర్తి చేయడానికి ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది..డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి. ప్రేమ...పెళ్లి వ్యవహారాలకు సానుకూలన స్పందన వస్తుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ( మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) అన్ని పనులలో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం . కుటుంబ సభ్యుల పోత్స్రాహం ఉంటుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్యా రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. కీలన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
తులారాశి: ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని భారం పెరగడంతో బిజీ బిజీగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో అప్రతమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారం చివరిలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
వృశ్చికరాశి: ఈ రాశి వారు ఈ వారం వృత్తి.. వ్యాపారాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఆఫర్లు వస్తాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ధనస్సు రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను .. ఆలోచనలను అందరూ అంగీకరిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.. వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వారి బిజినెస్ ఉత్సాహంగా సాగుతుతుంది. నిరుద్యోగులు కాల్ లెటర్స్ అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం ( మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. చేతివృత్తుల వారు బిజీ అవుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండం చాలా మంచిది . ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మకుండా.. మీ నిర్ణయాన్ని అమలు చేయండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఏ రంగానికి చెందిన వారైన మకర రాశి వారు ఈ వారం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి .. వ్యాపారాల్లో.. స్నేహితులు సహకారంతో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీకు పుష్కలంగా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి.. ఉద్యోగాల్లోమంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ప్రేమ , పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.