వారఫలాలు (సౌరమానం) అక్టోబర్ 20 నుంచి 26 వరకు

వారఫలాలు (సౌరమానం) అక్టోబర్ 20 నుంచి 26 వరకు

మేషం : ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. అదనపు ఆదాయం. వాహన యోగం. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో పురోగతి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు బాగుంటుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 

వృషభం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. సమాజంలో    కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆదాయం ఆశాజనకం. వ్యాపారులకు భాగస్వామ్య వివాదాల పరిష్కారం. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు రావచ్చు. కళాకారుల యత్నాలు సఫలం. పరిశోధకులు, వైద్యులు ప్రతిభను చాటుకుంటారు.

మిథునం : అధిక ఆదాయం వల్ల అవసరాలు, అప్పులు తీరతాయి. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు అమలులో పెడతారు. కుటుంబసభ్యులు సహకారం. కార్యక్రమాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారులకు లాభాలు, విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. కళాకారులు, వైద్యుల సేవలు విస్తృతం.

కర్కాటకం : అనుకున్న కార్యక్రమాల్లో విజయం. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. రాబడికి ఇబ్బంది లేదు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. క్రీడాకారులు, పరిశోధకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం : ముఖ్యమైన కార్యాలు అనుకున్న విధంగా పూర్తి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. అదనపు రాబడి. సమస్యల నుంచి విముక్తి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు సమాయత్తం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు. క్రీడాకారులకు పేరుప్రతిష్టలు.

కన్య : నూతన వ్యక్తుల పరిచయం. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సఫలం. కొన్ని వివాదాలు తీరతాయి. అనుకున్న ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన  మేర లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు యోగదాయకం. వైద్యులు, పరిశోధకుల ఆశలు ఫలించే సమయం. 

తుల : కొన్ని కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. శత్రువులను స్నేహితులుగా మార్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుంటారు. వివాహ యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అంది విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు. కళాకారులు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం : చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన విద్యావకాశాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అవసరాలకు తగిన ఆదాయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి. సోదరులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు భాగస్వాముల నుంచి పెట్టుబడులు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. క్రీడాకారులు, వైద్యులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

ధనస్సు : ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు.  ఉద్యోగయత్నాల్లో కొంత పురోగతి సాధిస్తారు. ఇంట్లో వేడుకలు నిర్వహిస్తారు. అనుకున్నంత ఆదాయం లభిస్తుంది. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. క్రీడాకారులకు గుర్తింపు.

మకరం : ఏ కార్యక్రమం చేపట్టినా సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  భూములు, ఇళ్లు కొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు. రాబడి ఆశించినమేరకు పెరుగుతుంది. వ్యాపా రులకు మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు నూతన పదవీయోగం. కళాకారులు, వైద్యుల సేవలకు గుర్తింపు.

కుంభం : చాకచక్యంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనుకున్న రాబడి పొందుతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. ప్రముఖుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆస్తుల వివాదాల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు. వ్యాపారులకు లాభాలు అందే అవకాశం. ఉద్యోగులు పైస్థాయి వారి  మెప్పు  పొందుతారు. కళాకారులు, రాజకీయవేత్తలకు సానుకూల పరిస్థితులు. క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు.

మీనం : ముఖ్య కార్యాల్లో అవాంతరాలు. కుటుంబ బాధ్యతలు సహనాన్ని పరీక్షిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఒక సమాచారం ఆదుర్దా కలిగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. స్నేహితులతో అకారణ తగాదాలు. వ్యాపారులకు కొంతమేర లాభాలు అందవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త చిక్కులు. వారారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400