మేషం : ఆర్థికంగా బలం చేకూరుతుంది. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపారులకు విస్తరణయత్నాలు కలసివస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు, కొన్ని పదవులు సైతం దక్కవచ్చు. కళాకారులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు.
వృషభం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ప్రత్యర్థులు కూడా మీ బాటలో నడుస్తారు. కొన్ని కార్యక్రమాలు స్వశక్తితో పూర్తి. ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు అప్రయత్న కార్యసిద్ధి. క్రీడాకారులు, కళాకారులు విదేశీ పర్యటనలు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.
మిథునం : అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. వాహన, కుటుంబసౌఖ్యం. ఒక సమాచారం విద్యార్థుల్లో సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఆశించిన లాభాలు. ఉద్యోగులు వివాదాల నుంచి గట్టెక్కి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వైద్యులు, క్రీడాకారులు శ్రమకు ఫలితం పొందుతారు.
కర్కాటకం : అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ వ్యూహాలు అమలు చేస్తారు. సమాజంలో మీ మాటకు ఎదురుండదు. ఆకస్మిక ప్రయాణాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో .ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజ కీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. కళాకారులు, పరిశోధకుల శ్రమ ఫలిస్తుంది.
సింహం : కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల తోడ్పాటు అందుతుంది.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు నష్టాల నుంచి గట్టెక్కుతారు. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పనిభారం కొంతమేర తగ్గుతుంది. మీ సత్తా పైస్థాయి వారు గుర్తిస్తారు. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం.
కన్య : అదనపు ఆదాయం. సన్నిహితులు మీ ప్రగతిలో సహకరిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు. క్రీడాకారులు, కళాకారులు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు.
తుల : చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. సోదరులు, స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమయానికి అందుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. అదనపు బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారుల లక్ష్యాలు నెరవేరతాయి.
వృశ్చికం : నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఇంటాబయటా ఎదురుండదు. కొత్త వస్తువులు కొంటారు. భూసంబంధ వివాదాల నుంచి విముక్తి. ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం రాగలదు. కళాకారులు, వైద్యుల ఆశలు నెరవేరతాయి.
ధనుస్సు : చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులే శత్రువులుగా మారవచ్చు. విద్యార్థులు ప్రతిభాపాటవాలు ఉన్నా గుర్తింపు పొందలేరు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటాబయటా వ్యతిరేకులు పెరుగుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకోవడంలో శ్రమపడాలి. ఉద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు. కళాకారులు అందివచ్చాయనుకున్న అవకాశాలు తప్పిపోవచ్చు. వారారంభంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం.
మకరం : పరిశోధనాత్మక విషయాలు తెలుసుకుంటారు. మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. స్థలాలు, వాహనాలు కొంటారు. రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు యత్నకార్యసిద్ధి. ఇంక్రిమెంట్లు లభించవచ్చు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరం. కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం.
కుంభం : వ్యూహాత్మకంగా కార్యక్రమాల్లో విజయం. ఆదాయం ఆశాజనకం. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో ఒప్పందాలు. ఆస్తుల వివాదాలు కొలిక్కి రావడంలో కీలకపాత్ర. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యాపారాలను విజయవంతంగా నడుపుతారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలిస్తాయి. పరిశోధకులు, వ్యవసాయదారులకు మరింత అనుకూలం.
మీనం : అప్పులు చేస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులు,స్నేహితుల నుంచి కొంత సాయం అందుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవర్గాల విదేశీ పర్యటనలు వాయిదా. కళాకారులు, వ్యవసాయదారులకు ప్రోత్సాహకరం.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400