రేపటి నుంచే ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు…

రేపటి నుంచే ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు…

రేపటి నుంచి ఆంద్ర ప్రదేశ్ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అడీషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఇన్స్ పెక్టర్ వరకు వీక్లీ ఆఫ్ లు అమలులోకి రానున్నట్లు చెప్పారు. దీంతో పాటు షిఫ్ట్ డ్యూటీలు కూడా ఉండనున్నాయన్నారు.  నక్సల్స్ , వీఐపీ డ్యూటీ సిబ్బంది కోసం ఇంబ్బంది కలుగకుండా కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటామని అన్నారు. ఏపీలో 12300 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20శాతం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

ఉద్యోగంలో భాగంగా పోలీసులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు రవిశంకర్ అయ్యనార్. దీంతో స్ట్రోక్స్, కిడ్నీ, షుగర్ లాంటి వ్యాదులతో పోలీసులు సఫర్ అవుతున్నట్లు చెప్పారు. రిటైర్ అయిన పదేళ్లలోనే చాలామంది చనిపోతున్నట్లు తెలిపారు. అయితే పోలీసులకు వీక్ ఆఫ్ ఇవ్వడంతో కొంత వరకు వారి ఒత్తిడిని దూరం చేసినట్లు అవుతుందని రవిశంకర్ అన్నారు.