నందిపేట, వెలుగు : నందిపేట , డొంకేశ్వర్ వార సంతల వేలం ఈనెల27, 28న ఆయా గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్టు ఎంపీఓ కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నందిపేటలో ఈనెల 27 న వారసంత , రోజువారి సంతలకు వేలం నిర్వహిస్తామని, వారసంత వేలంలో పాల్గొనే వారు
రూ. 50వేలు, రోజు వారి సంత వేలంలో పాల్గొనేవారు రూ. 30వేలు గ్రామ పంచాయతీలో డిపాజిట్ చేయాలన్నారు. అలాగే డొంకేశ్వర్ వారసంతను ఈనెల 28న నిర్వహిస్తామని ఇందులో పాల్గొనేవారు రూ. 10వేల ను డిపాజిట్ చేయాలని సూచించారు.