సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్, గోవా(-వాస్కోడిగామా) మధ్య ఏర్పాటు చేసిన కొత్త వీక్లీ ట్రైన్‌కు ఈ నెల6న ట్రయల్ రన్నిర్వహిస్తున్నారు. ఈ ట్రైన్సికింద్రాబాద్ స్టేషన్నుంచి బయలుదేరి కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ , మడ్గామ్మీదుగా తర్వాత రోజు ఉదయానికి వాస్కోడిగామా చేరుకుంటుంది.
ఇందులో ఫస్ట్‌ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ట్రయల్రన్అనంతరం ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ వీక్లీ ట్రైన్ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. గురు, శనివారాల్లో గోవా నుంచి రిటర్న్వస్తుంది.