ఆకలిగా అనిపించడం సాధారణ విషయమే. కానీ పదే పదే ఆకలిగా అనిపించడం వల్ల శరీరంలో క్యాలరీలు తీసుకోవడం పెరుగుతుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఆహారంలో జంక్ ఫుడ్ భాగమైపోయింది. వివిధ రకాల మసాలాలు, సాసేజ్‌లు, చీజ్‌లను నింపి తయారు చేసిన జంక్ ఫుడ్ ను చాలా మంది తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే, ఇది శరీరానికి హాని కలిగిస్తుందని తెలిసినప్పటికీ, దాన్ని తీసుకోవడం మాత్రం మానుకోరు. ఈ కారణంగా మళ్లీ మళ్లీ జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి సులభమైన పరిష్కారాలేంటో ఇప్పుడ తెలుసుకుందాం.
1. ఎక్కువ నీరు త్రాగాలి
పదే పదే ఆకలిగా అనిపిస్తే, ఏదైనా తినడానికి బదులు నీళ్లు తాగండి. ఇది శరీరాన్ని మొత్తం హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అధిక క్యాలరీలను తీసుకోకుండా చేస్తుంది. అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉంటే, ప్రతీసారి ఫుడ్ తీసుకోవాలన్న సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
2. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
రోజూ వారి భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటే, పలుమార్లు ఫుడ్ తీసుకోవాలన్న కోరిక తగ్గిపోతుంది. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు, గోళ్లను బలంగా ఉంచేది ప్రోటీన్. శరీరాన్ని బలపరిచే 20 రకాల అమినో యాసిడ్‌లు ప్రోటీన్‌లో ఉంటాయి.
3. పులియబెట్టిన ఆహారాన్ని భోజనంలో భాగం చేసుకోవాలి
పులియబెట్టిన ఆహారం శరీరానికి ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. దీని కోసం, భోజనంలో పెరుగు, పులియబెట్టిన సోయాబీన్స్‌తో తయారు చేసిన టేంపే, పులియబెట్టిన కూరగాయలతో తయారు చేసిన కిమ్చీని తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చక్కెర కోరికల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
4. కొంత సమయం పాటు బయట నడవాలి
రోజుకు 15 నుంచి 20 నిమిషాలు బయటి నడకకు వెళ్లాలి. ఇది శరీరంలో ఆనందం, శక్తి పెంచుతుంది. అంతే కాకుండా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
5. పండ్లు తీసుకోవాలి
చక్కెర కోరికలను నివారించడానికి పండ్లు ఉత్తమ ఎంపిక. దీని వల్ల కాస్త తీపితో పాటు ఫైబర్, పోషకాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా గింజలు, ధాన్యాలు, ఎండిన పండ్ల వంటి ఆహారాలను నిల్వ చేసి తీసుకోవచ్చు.