Health: రాంగ్​ డైటింగ్​.. ఆరోగ్యానికి విలన్

 Health: రాంగ్​ డైటింగ్​.. ఆరోగ్యానికి విలన్

బరువు తగ్గడంలో డైటింగ్​ దే  కీ రోల్.   చాలామంది  వ్యాయామం ఎక్కువగా చేస్తూ డైటింగ్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోరు. బరువు తగ్గడంలో డైటింగ్ 80 శాతం పాత్ర పోషిస్తే వ్యాయామం కేవలం 20 శాతం మాత్రమే .  బరుపు తగ్గించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకం డైట్​ ను  ఫాలో అవుతుంటారు. కానీ శరీరం తీరుని బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో డైట్ సూట్ అవుతుంది. ఇది తెలుసుకోకుండా రాంగ్ డైట్ ఫాలో అయితే.. అదే విలన్ గా మారుతుంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు డైటీషియన్ ను సంప్రదించి, సరైన డైట్ ప్లాను ఫాలో అవ్వాలి. అన్నిరకాల పోషకాలు బ్యాలెన్స్ చేస్తూనే.. బరువును కంట్రోల్  చేయాలి. 

వ్యాయామంలో తప్పులు

చాలామంది డైటింగ్, వ్యాయామం విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం నడుచుకుంటారు. అయితే అప్పుడప్పుడు శరీరం చెప్పేది కూడా వినాలి.. ఎప్పుడైనా తీవ్రంగా అలసిపోయి వ్యాయామం మానెయ్యాలనిపిస్తే ఒక్కరోజు మానెయ్యడం వల్ల పెద్దగా ప్రమాదమేదీ ఉండదు. అలాగే అప్పుడప్పుడు ఇష్టమైన ఆహారం కొద్ది మోతాదులో తీసుకున్నా ఫర్వాలేదు.   చాలామంది పొట్ట దగ్గర కొవ్వు తగ్గితే చాలు అనుకుంటారు. కేవలం పొట్ట వ్యాయామాలే చేస్తుంటారు. 

కానీ అది కరెక్ట్ కాదు.. శరీరం మొత్తానికి కదలిక ఉండేలా వ్యాయామాలు చేయాలి. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి కార్డియో వ్యాయామాలు కూడా మంచివే. వ్యాయామాలు ఎప్పుడూ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న చోటనే చేయాలి. అప్పుడే సరైన రిజల్ట్ ఉంటుంది. అలాగే చాలామంది జిమ్ తో పాటు ప్రొటీన్ షేక్, ప్రొటీన్ బార్స్​, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ అవి అంత హెల్దీ కావు.   ఓ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవడం కంటే.. ఓ గ్లాసుడు పాలు తాగడం ఎంతో బెటర్

వేగంగా తినడం

చాలామంది అంతగా పట్టించుకోని మరో చెడ్డ అలవాటు ఏంటంటే ఏదైనా సరే స్పీడ్​గా తినడం...  వేగంగా తినడం వల్ల దానితో పాటు గాలి కూడా వెళ్ళి గ్యాస్టిక్ సమస్యకు కారణమవుతుంది. అలా కాకుండా మెల్లగా, నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా డైజెస్ట్ అవుతుంది.  దీనివల్ల బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.  

ఇవి తప్పనిసరి

తక్కువ నిద్ర కూడా బరువు పెరగడానికి ఒక కారణమే. టైమ్ కు నిద్రపోకపోయినా, తగినంత నిద్ర లేకపోయినా దాని ప్రభావం శరీరం మీద పడి బరువు పెరిగేలా చేస్తుంది. నిద్రకు శరీరంలోని హార్మోనులకు సంబంధం ఉంటుంది.  తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి పెరిగి శరీరానికి ఎనర్జీ కోసం ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. అందుకే కనీసం  రోజుకు ఏడు గంటల నిద్ర  చాలా అవసరం.  శరీరానికి  సరైన విశ్రాంతి లేకపోవడం కూడా ఫ్యాట్​ కు  కారణమవుతుంది.  శరీరానికి రోజూ సరిపడినంత రెస్ట్​ ఇస్తేనే ఒత్తిడి, బరువు కంట్రోల్​ లో ఉంటాయి. 

ఆందోళన వద్దు

వెయిట్ లాస్ కోసం అందరూ చాలా కేర్ తీసుకుంటారు. కానీ కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల వాళ్లకి రిజల్ట్ కనపడదు. ముందుగా బరువు తగ్గాలనుకునేవాళ్లు చేయగలిగే వెయిట్ లాస్ ప్లాన్​ ను రూపొందించుకోవాలి. తక్కువ రోజుల్లో ఎక్కువ కేజీలు తగ్గిపోవాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. నెమ్మదిగా, హెల్దీగా బరువు తగ్గాలి, చాలామంది వెయిట్ లాస్ కోసం మార్నింగ్ వర్కవుట్స్ చేసి లేట్​ గా  బ్రేక్ పాస్ట్ చేస్తారు. దానివల్ల ఎన్ని వర్కవుట్స్ చేసినా యూజ్ ఉండదు. బ్రేక్ ఫాస్ట్ ఎర్లీగా చేసేయాలి. అలాగే కొంతమంది మార్నింగ్ బిజీగా ఉండి, ఈవినింగ్ వర్కవుట్స్ చేస్తారు. ఈ పద్దతి మంచిది కాదు. ఈవినింగ్ రెండు గంటల సేపు చేసి వ్యాయామం.. మార్నింగ్ గంట వ్యాయామంతో సమానం. అందుకే సాయంత్రాలు ఎక్కువగా కష్టపడకుండా పొద్దున్నే వ్యాయామం చేస్తే మంచి రిజల్ట్​ కనిపిస్తుంది. 

ALSO READ | ఆధ్యాత్మికం: ఆనందంగా జీవించాలంటే ఎలా బతకాలో తెలుసా..

చాలామంది గుడ్డు తినే వాళ్లు గుడ్డులోని పచ్చసొనను తినరు. అది ఫ్యాట్ అని అనుకుంటుంటారు. చాలామందికి తెలియని విషయమేంటంటే.. పచ్చసొన ఫ్యాట్ కాదు. అది వెయిట్​ లాస్​ కు చాలామంచిది. ఫ్యాట్ బర్న్ చేసే మినరల్స్ అందులో ఉంటాయి. గుడ్డు తినే వాళ్లు పచ్చసాన కూడా తప్పకుండా తినాలి. అలాగే చాలామంది డైట్, వర్కవుట్స్​పర్​ఫెక్ట్​గా మెయింటెయన్ చేసినా ఒక చిన్న తప్పు వల్ల బరువు తగ్గరు. అదే విటమిన్ డి. ... విటమిన్ డి లోపం ఉంటే.. ఎంత ట్రై చేసినా బరువు తగ్గరు. శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. అందుకే రోజు పొద్దున ఎండలో కా సేపు గడపాలి. ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను బరువు తగ్గి తీరతాను అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. బరువు గురించి ఎక్కువగా ఆందోళన పడితే మరింత బరువు పెరిగే ప్రమాదముంది.అందుకే సాధ్యమైనంత సంతోషంగా ఉండాలి..

-డా. సుజాత స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్-