
ఎండాకాలం వచ్చింది.. చాలామంది చన్నీళ్లతో స్నానం చేస్తారు. హాయిగా ఉంటుంది. కాని వేడి నీళ్లతో స్నానం చేయడం వలన ఆరోగ్య పరంగా చాలా ఉపయోగాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. అరగంట వాకింగ్ తో సమానమని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
బరువు తగ్గడానికి రకరకాల ప్రయాత్నాలు చేసి విసిగిపోయినారా? ఎక్సర్ సైజులు.. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నా.. రిజల్ట్ కనిపిస్తలేదా? అయితే, ఒకవైపు ఈ నియమాలు పాటిస్తూనే.. వేడి నీళ్లతో స్నానం చేస్తే బరువు తగ్గుతారని లండన్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో తేలింది.
వేడి నీళ్లతో స్నానం చేస్తే.. అది 30 నిమిషాల వాకింగ్ తో సమానమట. శరీరాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఫిట్ గా ఉంచుకోవడానికి వాకింగ్, ఎక్సర్ సైజ్, జిమ్ తో పాటు వేడి నీళ్ల స్నానం కూడా సాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
ALSO READ : స్టెరాయిడ్స్కండలు.. ఇన్ స్టంట్ బాడీ షేప్ కోసం వాడుతున్న యూత్.. ప్రాణాలు పోతాయంటున్న డాక్టర్లు
మొత్తం 14 మంది పురుషులపై ఈ అధ్యయనం చేపట్టారు. వీళ్లందరూ మొదట గంటసేపు సైకిల్ తొక్కడం, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేశారు. తర్వాత గంట వేడి నీటి టబ్ లో ఉన్నారు. ఈ రెండు పరీక్షల్లో ఖర్చయిన కేలరీలను లెక్కిస్తే సమానంగా తగ్గాయి. అంతేకాకుండా రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో 130 క్యాలరీలు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
సాధారణంగా వేడి నీళ్లు శరీర బరువును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతది. దీంతో బరువు తగ్గుతారని పరిశోధకులు అంటున్నారు. ఎండాకాలంలో కూడా గోరు వెచ్చని నీటితో స్నానం చేసి స్లిమ్‌గా తయారవుదాం..!