ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి

ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి

లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మల్లేషం ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్‌ చేయడానికి రూ. 10 వేలు లచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు గిరిధర్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో గల లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వారి సూచనల మేరకు 2024 మార్చి 21న గురువారం లంచం ఇస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.