ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకోవడంపై టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. వెల్‌కం బ్యాక్ ఎయిరిండియా అంటూ ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ సంస్థను స్థాపించిన తన తండ్రి జేఆర్డీ టాటా.. ఎయిరిండియా విమానం ముందు రాయల్‌గా నడిచొస్తున్న ఫొటోతో ఆయన తన ఫీలింగ్‌ను పోస్ట్ చేశారు.
‘‘గ్రేట్ న్యూస్.. ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది! ఎయిరిండియా పునర్నిర్మాణం కోసం గట్టి కృషి చేయాల్సి ఉంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో టాటా గ్రూప్ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నా” అని రతన్ టాటా అన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఎయిర్‌లైన్స్‌గా తన తండ్రి జేఆర్డీ టాటా నాయకత్వంలో నడిచిందని ఆయన గుర్తు చేశారు. ఆ ఇమేజ్‌ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం టాటాలకు తిరిగి దక్కిందని అన్నారు. ఈ సమయంలో జేఆర్డీ టాటా మన మధ్య ఉండుంటే ఆయన ఎంతో సంతోషించేవారంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. మళ్లీ తమ చేతిలోకి ఈ కంపెనీ వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Welcome back, Air India ?? pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021