పిల్లలే కాదు పెద్దలు కూడా కొబ్బరిని బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా వాటితో తయారు చేసే స్వీట్స్... ఎలాంటి అకేషన్ని అయినా స్పెషల్ గా చేస్తాయి. ఇలా చెప్తుంటేనే నోరు ఊరుతోంది కదూ. పైగా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి.. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మరింకెందుకు ఆలస్యం... ఈ న్యూ ఇయర్ ని కొబ్బరి స్వీట్స్ తో స్వాగతించండి.. వెంటనే ఈ కొబ్బరి స్పెషల్ని మీరూ ట్రై చేయండి.
పాయసం
కావాల్సినవి:
- బియ్యం - రెండు టేబుల్ స్పూను,
- ఎండుకొబ్బరి తురుము - అర కప్పు,
- ఇలాచీ పొడి - పావుటీ స్పూన్,
- బెల్లం తురుము లేదా చక్కెర- అరకప్పు,
- డ్రై ఫ్రూట్స్ (బారం, జీడిపప్పు, కిస్మిస్) అరకప్పు,
- నెయ్యి --సరిపడా, పాలు - పావు కప్పు
తయారీ:
బియ్యాన్ని సరిపడా నీళ్లలో పావుగంటసేపు నానబెట్టాలి. తర్వాత ఆ బియ్యాన్ని కొబ్బరి తురుము, ఇలాచీ పొడితో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. స్టడీ పాన్లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో కిస్మిస్, జీడిపప్పు, వాదం పలుకులు వేగించాలి. తర్వాత స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టి.. కొబ్బరి మిశ్రమం, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి సన్నని మంటపై కలుపుతూ ఉండాలి. ఆపైన మిశ్రమంలో బెల్లం తురుము లేదా చక్కెర, పాలు పోసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత నెయ్యిలో వేగించిన డ్రై ల్స్ వేసి దింపేయాలి.
బర్ఫీ
కావాల్సినవి:
- పచ్చి కొబ్బరి తురుము- నాలుగున్నర కప్పులు
- చెక్కెర - ఒకటిన్నర కప్పు
- నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,
- ఇలాచీ పొడి- అరటీస్పూన్, పాలు - అర కప్పు,
- చిక్కటి పాలు (చిక్కగా మరిగించి)-రెండున్నర కప్పులు,
- జీడిపప్పు తరుగు - రెండు టేబుల్ స్పూను
తయారీ:
ఒక పెద్ద పాన్లో కొబ్బరి తురుము, పాలు పోసి మరిగించాలి. తర్వాత చిక్కటి పాలు పోసి కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు మీడియం మంటపై కలపాలి. తర్వాత ఇలాచీ పొడి వేసి మరోసారి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత మిశ్రమాన్ని, నెయ్యి రాసిన పెద్ద ట్రీలో వేయాలి. దానిపై జీడిపప్పు తరుగు చల్లి, ఫ్రిజ్లో గంటసేపు పెట్టాలి. చివరగా బర్పీని ముక్కలుగా కట్ చేసి సర్చ్ చేసుకోవాలి.
ALSO READ | డబుల్ కా మీఠా.. 2 లక్షల మంది ఫేవరేట్ ఫుడ్.. స్విగ్గీలో హైదరాబాద్ టాప్
కుకీస్
కావాల్సినవి:
- మైదా పిండి-ఒక కప్పు,
- చక్కెర పొడి- అర కప్పు,
- ఎండు కొబ్బరి తురుము - అర కప్పు,
- బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,
- ఇలాచీ పొడి - పావు టీస్పూన్,
- నెయ్యి - అర కప్పు,
- డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) పావు కప్పు
తయారీ:
జీడిపప్పు, బాదం పలుకులను నెయ్యిలో వేగించి పక్కన పెట్టాలి. అలాగే ఎండు కొబ్బరి తురుము, మైదా పిండిని విడివిడిగా వేగించాలి. ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, చక్కెర పొడి, కొబ్బరి తురుము, బేకింగ్ సోడా, ఇలాచీ పొడి డ్రై ఫూల్స్, నెయ్యి వేసి బాగా కలపాలి పిండిని మెత్తగా కలిసి కొద్ది సేవు పక్కనపెట్టాలి. తర్వాత స్టన్ప్లేపై ప్రెజర్ కుక్కర్ పెట్టి, అడుగుభాగంలో ఇసుక పోయాలి. ఐదు నిమిషాలు హై లో పెట్టి, తర్వాత తగ్గించాలి. నెయ్యి రాసిన ట్రేలో చిన్నచిన్న పిండి బిళ్లలను పెట్టి మూత పెట్టాలి. విజిల్ గ్యాస్కెట్ తీసేసి సన్నని మంటపై కుక్కర్ ను అరగంట సేపు ఉంచాలి. కుకీస్ పూర్తిగా చల్లారాక, వాటిని బయటికి తీయాలి.
లడ్డూ
కావాల్సినవి:
- ఎండుకొబ్బరి తురుము - రెండున్నర కప్పులు
- లేత చక్కెర పాకం - ఒక కప్పు లేదా చిక్కటి పాలు (చిక్కగా మరిగించి)- ముప్పావు కప్పు,
- ఇలాచీ పొడి - అర టీ స్పూన్
తయారీ:
ఒక పాన్లో లేతచక్కెర పాకం లేదా చిక్కటి పాలు వేసి వేడి చేయాలి. అది కొంచెం వేడెక్కగానే ఎండు కొబ్బరి తురుము వేసి కలపాలి. మిశ్రమం గట్టిపడి, పాన్ కు అతుక్కు పోయేవరకు కలపాలి. తర్వాత ఇలాచీ పొడి, ఇంకొంచెం కొబ్బరి తురుము వేసి మెత్తగా కలపాలి. మిశ్రమం పిండి ముద్దలా అయ్యాక కొద్దికొద్దిగా తీసుకుని ఉండలు కట్టాలి. వీటిని కొద్దిసేపు ఫ్రిజ్లో పెడితే, లడ్డూలు గట్టిపడతాయి.
== వెలుగు లైఫ్