జమ్మికుంట, వెలుగు : యశ్వంత్‌పూర్– గోరఖ్‌పూర్ రైలుకు జమ్మికుంట స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. మంగళవారం తొలిసారి స్టేషన్‌లో హాల్ట్ అయిన రైలుకు బీజేపీ లీడర్లు, రైల్వే అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీకుమార్, ఎంపీ బండి సంజయ్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు మాట్లాడుతూ వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో -గోరక్ పూర్ రైలు ఆగడం సంతోషకరమన్నారు. ఈ హాల్టింగ్‌కు సహకరించిన ఎంపీకి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో లీడర్లు గౌతంరెడ్డి, మల్లేశ్, శ్రీనివాస్, రాజేందర్, రాజు, రాజ్ కుమార్, రాజేశ్‌ఠాకూర్, కైలాస్ కోటి తదితరులు పాల్గొన్నారు.