సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: BRS ఎమ్మెల్యే కృష్ణారావు

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: BRS ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్: హైడ్రాపై అఖిలపక్ష మీటింగ్​ పెడుతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణభవన్‎లో ప్రెస్​మీట్‎లో ఆయన మాట్లాడారు. ఇప్పటీకే హైడ్రాపై అఖిలపక్ష మీటింగ్​పెట్టాలని కోరిన్నట్లుగా ఆయన తెలిపారు. ‘ హైడ్రా పేరుతో మూడు నెలల నుంచి ప్రజలు భయపడుతున్నారు.  సిటీలో గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి..? ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే విషయాలను ప్రభుత్వం బయటపెట్టాలి. నల్లచెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయని సీఎం చెప్పడాన్ని ఖండిస్తున్న.. ఎవరు అక్రమణలు చేశారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలి. బీఆర్ఎస్​ హయంలోనే నల్ల చెరువు పరిరక్షణ కోసం ప్రత్యేక కట్టను నిర్మించం.  రైతులు కోర్టుకు వెళ్ళడంతో జీహెచ్ఎంసీ అధికారులు కట్టను తొలగించారు. 

Also Read : రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది

సీఎం రేవంత్​రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.   అధికారంలో మీ చేతుల్లోనే ఉంది కదా.. విచారణ చేసుకోండి. కూకట్​పల్లి నియోజకవర్గంలో ఎస్టీపీలను నిర్మించం. కాజాకుంటలో ఇద్దరు జడ్జీలకు ఏ పార్టీ నేతలు భూములు అమ్మారో  సీఎం విచారణ చేయించాలి. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న  ప్రజలను కబ్జాదారులు అనడం సరికాదు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించండి. చెరువులు కబ్జాలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. సిటీని అభివృద్ది చేసింది బీఆర్ఎస్ మాత్రమే. కేంద్రం నుండి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. హైడ్రా బాదితుల తరుఫున  బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మాత్రమే మాట్లాడుతున్నారు. నిరుపేదల జోలికి వస్తే ఊరుకోమని’ అని  కూకట్​పల్లి ఎమ్మెల్యే  కృష్ణారావు ఫైర్​అయ్యాడు