పగుళ్లు చూపిన గోడలు, పెచ్చులూడుతున్న పైకప్పులు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా చోట్ల బిల్డింగ్లు శిథిలవాస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. బిల్డింగ్ లపైకప్పుల పెచ్చులూడి, గోడలకు పగుళ్లు వచ్చాయి. వర్షానికి అనేక చోట్ల ఉరుస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్ బిక్కుబిక్కకుమంటూ గడుపుతున్నారు. జిల్లాలో 26 బీసీ వెల్ఫేర్హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 19 సొంత బిల్డింగ్స్ కాగా, 7 కిరాయి బిల్డింగ్లు. సోషల్ వెల్ఫేర్ పరిధిలో 31 హాస్టళ్లకు గాను 28 సొంత బిల్డింగ్లు, 3 కిరాయివి. 11 ఎస్టీ హాస్టల్స్ఉండగా, 9 సొంత బిల్డింగ్లు, 2 కిరాయి వాటిల్లో కొనసాగుతున్నాయి. అన్నింట్లో కలిపి 5,200 మంది స్టూడెంట్స్ ఉన్నారు.
పరిస్థితి ఇది..
హాస్టల్ బిల్డింగ్లలో అనేకం దశాబ్దాల క్రితం నిర్మించినవే. మెయింటనెన్స్ లేకపోవడం, చిన్న పాటి రిపేర్లు వచ్చినప్పుడు వెంటనే చేయించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. 2 ఏండ్ల కింద రూ.2 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని చోట్ల రిపేర్లు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 10కి పైగా బిల్డింగ్లు పైకప్పుల ఊడి, గోడలు పగుళ్లు చూపాయి. వర్షానికి నీరుకారుతున్నాయి. ప్రమాదకరంగా మారిన వాటిల్లోనే స్టూడెంట్స్ ఉంటున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు స్టూడెంట్స్తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బిల్డింగ్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని స్టూడెంట్స్ఆర్గనైజేషన్స్ కోరుతున్నాయి.
ఇది ఎల్లారెడ్డి కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్. బిల్డింగ్పైకప్పు శిథిలావస్థకు చేరింది. స్టూడెంట్స్ఉండే రూమ్స్తో పాటు హాల్, వరండా పైకప్పు పెచ్చులూడుతోంది. సిమెంట్ ఊడి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 35 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. దశాబ్దాల కింద నిర్మించిన ఈ బిల్డింగ్కు రిపేర్లు చేయాల్సిన అవసరముంది.
ఇది భిక్కనూరులోని బీసీ బాయ్స్హాస్టల్. ప్రస్తుతం 116 మంది స్టూడెంట్స్ఉన్నారు. బిల్డింగ్పై కప్పు, గోడలు పగుళ్లు వచ్చాయి. వర్షం కురిసినప్పుడు బిల్డింగ్ఉరుస్తుంది. గోడల వెంట నీళ్లు కారుతున్నాయి. వర్షం కురిసినప్పుడు గదిలోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్స్ చెబుతున్నారు.