ఉపాధి కూలీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

ఉపాధి కూలీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

మెట్ పల్లి, వెలుగు: ఉపాధి కూలీలకు వచ్చే జీతాన్ని పెంచి వారి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోందని కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగారావు అన్నారు. మంగళవారం మెట్‌‌‌‌పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలను కలిసి చేతి గుర్తుకు ఓటువేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉండాలంటే  కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో లీడర్లు అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఆకుల లింగారెడ్డి పాల్గొన్నారు.