షెడ్యూల్డ్​ కులాల సంక్షేమం

షెడ్యూల్డ్​ కులాల సంక్షేమం

1931 జనాభా లెక్కల నుంచి డిప్రెస్​డ్​ క్లాస్​ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 మొదటిసారిగా షెడ్యూల్డ్​ కులాలు అనే పదాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగానే 1936లో మొదటిసారి గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా(షెడ్యూల్డ్​ కాస్ట్​) ఆర్డర్​ ద్వారా మొదటిసారి షెడ్యూల్డ్​ కులాల పట్టికను రూపొందించారు. షెడ్యూల్డ్​ కులాల సంక్షేమం అనేది కేంద్ర సామాజిక న్యాయం, మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది. అధికరణ 341(1) ఆధారంగా రాష్ట్రపతి ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో 1263 కులాలను షెడ్యూల్డ్​ కులాలుగా గుర్తించారు. తెలంగాణలో 59 ఎస్సీ కులాలను గుర్తించారు. అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 101 కులాలను ఎస్సీ కులాలుగా గుర్తించారు. అరుణాచల్​ప్రదేశ్​, నాగాలాండ్​, అండమాన్​, లక్షద్వీప్​ల్లో ఎస్సీలు లేరు. 

రాజ్యాంగం కల్పించిన హక్కులు

 

  • ఆర్టికల్​ 14: చట్టం ముందు అందరూ సమానులే.
  • ఆర్టికల్ 15: వివక్షత ఏ రూపంలో ఉన్నా  నిషేధం.
  • ఆర్టికల్ 15(4): వెనుకబడిన వారికోసం లేదా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించవచ్చు. 
  • ఆర్టికల్15(5): అన్నిరకాల విద్యా సంస్థల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్స్​ కల్పించారు. 
  • ఆర్టికల్​ 16: ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
  • ఆర్టికల్ 16(4): బలహీనవర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే కొన్ని రకాల ఉద్యోగాలను వారికికేటాయించవచ్చు. 
  • ఆర్టికల్ 16(4) (ఎ): పదోన్నతుల్లో రిజర్వేషన్ అవకాశం.
  • ఆర్టికల్ 17: అంటరానితనం నిషేధం.
  • ఆర్టికల్ 19(1)(బి): స్వేచ్ఛగా తిరిగే హక్కు
  • ఆర్టికల్ 19(1)(ఈ): భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు
  • ఆర్టికల్​ 19(1)(జి): ఏ వృత్తి అయినా వ్యాపారమైనా చేయవచ్చు.
  • ఆర్టికల్​ 23: వెట్టి చాకిరి, మనుషుల అక్రమ రవాణా, దేవదాసీ, జోగినీ ఆచారాల నిషేధం.
  • ఆర్టికల్ 24: 14 సంవత్సరాల లోపు పిల్లలు హానికరమైన పరిశ్రమలో పని చేయరాదు. 
  • ఆర్టికల్ 25 (బి): హిందూ మతంలోని అన్ని వర్గాల వారికి దేవాలయ ప్రవేశం హక్కు.
  • ఆర్టికల్​ 46: బలహీనవర్గాలను అభివృద్ధిపరచడం రాజ్యం విధి. 
  • ఆర్టికల్​ 243 (డి) (1): గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు.
  • ఆర్టికల్​ 243(డి) (4): గ్రామ పంచాయతీ వ్యవస్థలో అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు కేటాయించాల్సిన సీట్లను రొటేషన్​ పద్ధతిలో శాసనసభ నిర్ణయిస్తుంది. 
  • 243(టి) (1): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు. 
  • 243 (టి) (4): పట్టణ స్థానిక సంస్థల అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
  • ఆర్టికల్​ 320(4): ఎస్సీ, ఎస్టీ నియామకాలకు, రిజర్వేషన్​కు సంబంధించి పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ను సంప్రదించాల్సిన అవసరం లేదు. 
  • ఆర్టికల్​ 330: లోక్​సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్​
  • ఆర్టికల్​ 332: శాసనసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్​.
  • ఆర్టికల్​ 338: షెడ్యూల్డ్​ కులాల కోసం జాతీయ కమిషన్​ ఏర్పాటు
  • ఆర్టికల్​ 339(ఎ): ఎస్టీల కోసం జాతీయ కమిషన్​ ఏర్పాటు 
  • ఆర్టికల్​ 341(1): ఈ అధికరణం ప్రకారమే రాష్ట్రపతి ఎస్సీలను గుర్తిస్తారు.
  • ఆర్టికల్​ 366(24): ఎస్సీల నిర్వచనం
  • ఆర్టికల్​ 335: ప్రభుత్వ సర్వీసుల విషయంలో ఎస్సీ, ఎస్టీ న్యాయపరమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 
  • జాతీయ షెడ్యూల్డ్​ కులాల కమిషన్​
 

రాజ్యాంగంలోని 16వ విభాగంలో గల ఆర్టికల్​338 ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగబద్ధ సంస్థ. 89వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్​ ఉండేవి. 2004 నుంచి ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పడ్డాయి. 

  •     2004లో ఏర్పడింది. ప్రస్తుత కమిషన్​ ఆరోది.
  •     ఒక చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు  అంటే మొత్తం ఐదుగురు సభ్యులతో కూడి ఉంటుంది. 
  •     మూడేండ్ల పదవీ కాలానికిగాను రాష్ట్రపతి నియమిస్తాడు.
  •     మొదటి చైర్మన్​: సూరజ్​ భాను
  •     ప్రస్తుత చైర్మన్: ​ విజయ్​ సంపాల
     

విధులు: ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ హక్కుల ఉల్లంఘన అమలు తీరు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విధులను కలిగి ఉంటుంది.,  ఎస్సీల సామాజిక ఆర్థిక వికాసం కోసం తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది.,  వార్షిక నివేదికలను, అవసరమైన సందర్భంలో ఇతర నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తుంది., రాష్ట్రపతి నివేదికను పార్లమెంట్​ ముందు ఉంచుతారు. వీరి సూచనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోని సందర్భంలో పార్లమెంట్​కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది., రాష్ట్రపతి సూచించిన ఇతర బాధ్యతలు స్వీకరిస్తుంది. 

  •     దేశంలో ఎస్సీ జనాభా 16.6శాతం (20.14 కోట్ల జనాభా)
  •     తెలంగాణలో ఎస్సీ జనాభా 15.45శాతం (54.08 లక్షలు)
  •     దేశంలో ఎస్సీల లింగ నిష్పత్తి 945
  •     తెలంగాణలో ఎస్సీల లింగ నిష్పత్తి 1008
  •     ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం: ఉత్తరప్రదేశ్​
  •     ఎస్సీ జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రం: మిజోరాం
  •     అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఎస్సీ జనాభా శాతం పంజాబ్​ రాష్ట్రంలో ఉంది. 
  •     బిహార్​ రాష్ట్రంలోని కోచ్​ జిల్లాలో 50శాతం మంది ఎస్సీలు ఉన్నారు
  •     ఎస్సీలపై నేరాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్​లో జరుగుతున్నాయి