గోదావరిఖనిలో గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ మృతి

గోదావరిఖనిలో గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ మృతి

గోదావరిఖని, వెలుగు: గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయాడు. సింగరేణి రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని ఓసీపీ 3లో పాగోలు రాజు(54) వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున చాతీలో నొప్పి వస్తుందని చెప్పారు. అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో డిస్పెన్షరీకి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిశీలించగా అప్పటికే రాజు చనిపోయినట్లు నిర్ధారించారు. సింగరేణి ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ అర్జీ-2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ బదావత్ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, సీఐటీయూ ఏరియా సెక్రటరీ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు.

మల్యాలలో ప్రైవేటు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

మల్యాల, వెలుగు: మల్యాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భోగ ఉమామహేశ్వరి(43) గుండెపోటుతో చనిపోయారు. బుధవారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో యూకేజీ పిల్లలకు మధ్యాహ్నం పాఠాలు బోధిస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే తోటి టీచర్లు జగిత్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించేలోపే చనిపోయింది. స్కూల్‌‌‌‌‌‌‌‌ కరస్పాండెంట్‌‌‌‌‌‌‌‌ నరేశ్‌‌‌‌‌‌‌‌, తోటి టీచర్లు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా,  మృతురాలికి భర్త, కొడుకు ఉన్నారు.