డైట్ ప్రిపరేషన్​ ఎలా? తికమక పడుతున్న సంక్షేమాధికారులు

  • కష్టమంటున్న బీసీ, ఎస్సీ వెల్ఫేర్​ఆఫీసర్లు 
  • కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు,చికెన్, మటన్​రేట్లు కలిపితేనే కొత్త రేట్లు 
  • 192 స్కూల్స్, హాస్టల్స్ పై ఒక్కటే ఏజెన్సీ గుత్తాధిపత్యం
  • విజిటెబుల్స్, పండ్ల రేట్ల మీద అధికారుల్లో అయోమయం 

 

నల్గొండ, వెలుగు : బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్స్​లో చదివే పేద విద్యార్థులకు డైట్​ప్రిపరేషన్​ఎట్ల చేయాలో అర్థంగాక సంక్షేమశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కొనుగోలు కమిటీ ఖరారు చేసిన కిరాణం సామన్ల రేట్ల ప్రకారం విద్యార్థులకు కొత్త డైట్​ప్రిపేర్​చేయడం అంత సులువు కాదని స్పష్టం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్షేమ ఆఫీసర్లతో చర్చించి రేట్లను డిసైడ్​చేస్తే బాగుండేదని, కానీ పర్చేజింగ్​కమిటీ ఏకపక్షంగా వ్యవహరించడంతో సంక్షేమ అధికారులు తికమక పడుతున్నారు.  

వివాదాస్పదంగా మారిన ఆఫీసర్ల చర్యలు..

కేజీబీవీ, మోడల్​ స్కూల్స్​ టెండర్లతో మొదలైన వివాదం అన్ని శాఖల ఆఫీసర్లను ఇరకాటంలో పడేసింది. ఇదే ఆర్డర్​ కాపీని అడ్డంపెట్టుకుని అన్ని శాఖల్లో కాంట్రాక్టు కొట్టేయాలని వేసిన ప్లాన్ అధికారుల మెడకు ఉచ్చులా చుట్టుకుంది. కేజీబీవీ, మోడల్​స్కూల్స్​లో కిరాణం కాంట్రాక్టర్​కు మేలు చేసేందుకు కూరగాయలు, ఫ్రూట్స్​, చికెన్, మటన్​రేట్లలో భారీగా కోత పెట్టడంతో పాలు, గుడ్ల రేట్లు గిట్టుబాటుకాక కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు.

 ఇదే కాంట్రాక్టర్​కు బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాలు, ఎస్సీ, బీసీ జనరల్​హాస్టల్స్​లో కిరాణం సామన్లు సప్లై చేసే కాంట్రాక్టు సైతం అప్పనంగా రాసివ్వడం కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. 192 స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లో  టెండర్ పిలవకుండానే నామినేషన్ బేసిస్​లో జిల్లా కొనుగోలు కమిటీ ఆఫీసర్లు కిరాణం కాంట్రాక్టు ఒక్కరికే కట్టబెట్టారు. 

ప్రొవిజెన్స్​అన్ని కలిపి రేట్లు డిసైడ్​చేయలే..

గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్​లో డైట్​చార్జీలు ఒక్కో రకంగా ఉన్నాయి. పైగా ప్రతి ఏడాది కిరాణం, కూరగాయలు, పాలు, పండ్లు, చికెన్​, మటన్ అన్నింటికీ టెండర్లు పిలిచి రేట్లు డిసైడ్ చేశాకే ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ ప్రకారం ఆ ఏడాది డైట్ ఫిక్స్​ చేశారు. కానీ ఇక్కడ ముందుగా కిరాణం టెండర్​ఒక్కటే ఫైనల్ చేయగా, మిగతా ప్రొవిజెన్స్​టెండర్ ఓపెన్​ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

వాస్తవానికి ప్రతి ఏడాది అన్ని డిపార్ట్​మెంట్లు వేటికి అవే సపరేటుగా టెండర్లు పిలుస్తారు. కానీ ఈసారి కిరాణం కాంట్రాక్టర్​ లబ్ధిచేయడం కోసం అన్నింటికీ కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడంతో సమస్యలు తలెత్తాయి. 

ALSO READ : స్పీడందుకున్న ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్​

 

కాబట్టి ప్రొవిజెన్స్​అన్ని కలిపి డైట్​చార్జీలు లెక్క చేసినట్లయితే దాని ప్రకారం విద్యార్థులకు కొత్త మోనూ అమలు చేయడం కుదరుతుందని, లేదంటే విద్యార్థులకు కష్టాలు పునరావృతమవుతాయని ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా పాత డైట్​నే అమలు చేస్తున్నామని, కొనుగోలు కమిటీ అన్నింటికీ కలిపి డైట్​చార్జీలు మరోసారి పరిశీలించాలని సంక్షేమ అధికారులు కోరుతున్నారు. 

కూరగాయాలు, ఫ్రూట్స్ టెండర్లలో అయోమయం..

కిరాణం కాంట్రాక్టు ఒక్కరికే అప్పగించిన కొనుగోలు కమిటీ.. కూరగాయలు, ఫ్రూట్స్, పాలు, గుడ్లు, చికెన్​, మటన్​కు మాత్రం టెండర్లు పిలిచింది. కానీ ఎప్పుడో వారం రోజుల క్రితం రేట్లు ఫైనల్ చేయాల్సి ఉండగా, టెండర్లు ఓపెన్ చేయకుండా వాయిదా వేస్తున్నారు. అసలు తమతో చర్చించకుండానే ఏకపక్షంగా కిరాణం రేట్లు డిసైడ్​ చేయడం ఒక ఎంతైతే, కూరగాయలు, ఫ్రూట్స్ రేట్లు డిసైడ్​ కాకుండా కిరాణం సామన్లకు ఇండెంట్ ఏ విధంగా పెట్టాలని సంక్షేమ అధికారులు సతమతమవుతున్నారు.