
గతంలో ఇంటి ఆవరణలో చాలా స్థలం ఉండేది. అప్పుడు నీటి వసతి కోసం మోట బావులు తవ్వించుకొనే వాళ్లం. ప్రస్తుతం విశాలంగా స్థలాలు దొరకడం లేదు. గతంలో బావి ఉన్న ప్రదేశాన్ని చదును చేసి అంటే మట్టితో నింపి.. దానిపై నిర్మాణాలు చేపడుతున్నారా.. అలా బావిని పూడ్చి అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా.. వారికి.. ఆ ఇంట్లో ఉండే వారికి చాలా ఇబ్బందులు వస్తాయని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.
ప్రశ్న: గతంలో ఇంటి ముందు మంచినీళ్ల బావి మట్టితో పూడ్చేశాం. బావి ఉండే స్థలం ఇప్పుడు పూర్తిగా సమాంతరంగా ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్లో పశువుల కోసం పాక కట్టుకోవచ్చా?
జవాబు : గతంలో బావి ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చెయ్యొద్దు. ఆ స్థలంలో ఇల్లు కడితే.. ఇంట్లో వాళ్లకు కీడు కలుగుతుంది. పశువుల పాక కడితే పశువులకు మంచిది కాదు. కాబట్టి ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేయడమే మేలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.
ఇంటి కి ఉండే డోర్లను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకోకపోతే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు కాశీనాథుని శ్రీనివాస్
ప్రశ్న: ఇంటికి రెండు వైపులా వాకిలి ఉండి.. . మెయిన్ డోర్ పడమర ఫేసింగ్.. తూర్పు వైపు రోడ్డు ఉంది. అటు వైపు కూడా డోర్ ఉంది.. కానీ.. దాన్ని వాడడంలేదు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం నుంచి పడమర వైపు ఉన్న డోర్ నుంచి నడుస్తున్నాం. ఈ డోర్నే ఎక్కువగా వాడుతున్నాం. ఈ రెండు డోర్లలో దేన్ని వాడితే మంచిది?
జవాబు: తూర్పు వైపు మెయిన్ రోడ్డు ఉంటే అటువైపు నుంచి నడిస్తే మంచిది. పడమర వైపు ఉన్న ద్వారం కూడా వాడొచ్చు. కానీ.... తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని ఎక్కువగా వాడితే.. ఇంట్లోవాళ్లకు అన్నివిధాలా బాగుంటుంది. ఈ ద్వారం నుంచి నడిస్తే ఇంటి చుట్టూ తిరిగి రావాల్సిన పని కూడా ఉండదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు