ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ప్రస్తుతం సూపర్-4లో శ్రీలంకపై మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కి శుభమాన్ గిల్, రోహిత్ శర్మ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. 11 ఓవర్లలోనే తొలి వికెట్ కి 80 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా స్కోర్ బోర్డుని తీసుకెళ్తున్నారు. అయితే 15.1 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లను 91 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా.. గిల్, కోహ్లీ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్రికెట్ లో ఇలా కుప్పకూలడం సహజమే అయినా ఈ మూడు వికెట్లు ఒక కుర్రాడికి దక్కడం విశేషం.
టాపార్డర్ కకావికలం
టీమిండియా టాపార్డర్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ముగ్గురిని శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే అవుట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ఈ కుర్రాడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 3 పరుగులు చేసి, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లోనే దసున్ శనకకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. రోహిత్ శర్మ కి ఒక మ్యాజికల్ డెలివరీ వేసి క్లీన్ బౌల్డ్ చేసాడు.
☝ Shubman Gill
— ICC (@ICC) September 12, 2023
☝ Virat Kohli
☝ Rohit Sharma
A stunning spell from Dunith Wellalage sees India's top three back in the hut ?#INDvSL ?: https://t.co/wrkCBdraLq pic.twitter.com/vOlTAJKSZT
ఇంతకీ ఎవరీ వెల్లలాగే
శ్రీలంక క్రికెట్ కి మరో టాప్ క్లాస్ స్పిన్నర్ దొరికినట్టే కనిపిస్తున్నాడు. 20 ఏళ్ళ వెల్లలాగే తన హాఫ్ స్పిన్ తో అండర్-19 క్రికెట్ తో పాటు ఇటీవలే ఆసియా ఎమర్జింగ్ టోర్నీలో కూడా తన స్పిన్ ప్రతాపం చూపించాడు. తాజాగా.. ప్రధాన స్పిన్నర్ హసరంగా గాయపడడంతో జట్టులోకి చేరిన ఈ హాఫ్ స్పిన్నర్ .. తన మార్క్ స్పిన్ తో అదరగొడుతూ ఫ్యూచర్ స్టార్ గా కితాబులు అందుకుంటున్నాడు. మరి వెల్లలాగే తన ఫామ్ ని ఎక్కడి వరకు కొనసాగిస్తాడో చూడాలి.
☝️First over: Shubman Gill
— CricTracker (@Cricketracker) September 12, 2023
☝️Second over: Virat Kohli
☝️Third overs: Rohit Sharma
20-year-old Dunith Wellalage is announcing himself on the big stage ?#INDvSL pic.twitter.com/6IJtJz7JED