హైదరాబాద్, వెలుగు: హోం అప్లయెన్సెస్ కంపెనీ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, అమెరికన్ ఇంటీరియర్ డిజైనర్ జెరెమియా బ్రెంట్‌తో చేతులు కలిపింది. కొత్తగా హోం టెక్స్టైల్స్ఫర్నిషింగ్స్ను ప్రారంభించేందుకు ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
న్యూయార్క్ నగరంలోని ది హోమ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ వచ్చే నెల నిర్వహించే మార్కెట్ వీక్‌లో ఈ ప్రొడక్టులను ప్రదర్శిస్తామని వెల్స్పన్ తెలిపింది. తాము బెడ్, బాత్, ఫ్లోరింగ్ సొల్యూషన్స్‌ను తయారు చేస్తామని పేర్కొంది.