వెల్‌‌‌‌స్పన్ లివింగ్ లాభం రూ. 202.4 కోట్లు

 వెల్‌‌‌‌స్పన్ లివింగ్ లాభం రూ. 202.4 కోట్లు

న్యూఢిల్లీ: హోమ్ టెక్స్‌‌‌‌టైల్స్ కంపెనీ వెల్‌‌‌‌స్పన్ లివింగ్ లిమిటెడ్ నికర లాభం (కన్నాలిడేటెడ్‌)  సెప్టెంబరు 30, 2024తో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.202.4 కోట్లకు పెరిగింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో కంపెనీ రూ. 200.41 కోట్ల లాభం సంపాదించింది. కార్యకలాపాల ఆదాయం రూ. 2,873.09 కోట్లుగా ఉంది, ఇది గత ఏడాది క్వార్టర్​లో రూ. 2,509.08 కోట్లుగా ఉంది.