నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

  • భారత తొలి క్రికెటర్‌గా తంగరసు నటరాజన్ రికార్డు

యంగ్‌ పేసర్‌ తంగరసు నటరాజన్‌ అరుదైన రికార్డు సాధించాడు. నెట్‌ బౌలర్‌‌గా ఆస్ట్రేలియాకు వచ్చిన అతను ఒకే టూర్‌ లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఇండియా ఫస్ట్‌ క్రికెటర్‌గా నిలిచాడు. డిసెంబర్‌ 2న ఆసీస్‌‌పై థర్డ్‌ వన్డేతో ఇంటర్నేషనల్‌‌ డెబ్యూ చేసిన అతను రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ వెంటనే జరిగిన టీ20 సిరీస్‌‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ చాన్స్‌ దక్కించుకున్న నట్టూ 6 వికెట్లతో మెప్పించాడు. ఇప్పుడు బుమ్రా గైర్హాజరీలో టెస్టు క్యాప్‌ కూడా అందుకున్న తమిళనాడు బౌలర్‌ .. ఫస్ట్‌ డేనే ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో ఇండియా 300వ ప్లేయర్‌ గా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ నుంచి టెస్ట్ క్యాప్‌ అందుకున్నాడు. మరోవైపు 301వ ప్లేయర్‌ గా తమిళనాడుకు చెందిన సుందర్‌కు  స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ క్యాప్‌ అందించాడు. తన డెబ్యూ మ్యాచ్‌ లోనే స్మిత్‌ను ఔట్‌ చేసిన సుందర్‌ కూడా ఆకట్టుకున్నాడు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!