West Bengal Assembly Election Results 2021 Live Updates

West Bengal Assembly Election Results 2021 Live Updates

West Bengal Assembly Election Results 2021 Live Updates Total Seats 0/294

  TMC BJP Left+ Others
Lead        
Won 214 77 1 2

Live updates:

May 02, 2021 19:11 (IST): తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో  ఓటమి పాలయ్యారు. ఒకప్పటి తన అనుకూలుడు, కుడిభుజంగా భావించే సువేందు అధికారి (బీజేపీ అభ్యర్థి).. దీదీపై 1,622 ఓట్ల తేడాతో నెగ్గారు. రౌండ్ రౌండ్‌‌కు ఆధిక్యం మారుతూ వచ్చిన ఈ పోటీలో చివరికి సువేందుదే పైచేయి అయ్యింది. నందిగ్రామ్‌‌లో తనపై పోటీ చేయాలని, 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఎన్నికలకు ముందు దీదీకి సవాల్ విసిరిన సువేందు.. మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నారు. కాగా, నందిగ్రామ్ ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నానని మమత అన్నారు. తాను ఓడినా రాష్ట్రవ్యాప్తంగా 221 సీట్లు గెల్చుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ గెలుపు దేశ ప్రజల విక్టరీ అని పేర్కొన్నారు.  

May 02, 2021 13:13 (IST): బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తోంది. ఇకపోతే.. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన క్రికెటర్ మనోజ్ తివారీ విజయం సాధించారు. బెంగాల్‌‌లోని శిబ్‌‌పూర్‌ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తివారీ విక్టరీ కొట్టారు. 32,339 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై ఆయన గెలిచారు. 

May 02, 2021 10:08 (IST) : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసకందాయంలో ఉన్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతున్నా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం వెనకంజలో పడ్డారు. ఆమె నందిగ్రాం నుంచి పోటీచేశారు. ఆమెపై బీజేపీ తరపున ఆమె మాజీ శిష్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం మమత మీద 4,500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

May 02, 2021 11:12 (IST) : బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 148. ఆ సంఖ్యను ప్రస్తుతం టీఎంసీ దాటేసింది. దాంతో సింగిల్‌గానే టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కాగా.. మమతపై పోటీ చేసిన సువేందు అధికారి 8000 లీడ్‌లో కొనసాగుతున్నారు. టాలీగంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో తన సమీప అభ్యర్థిపై 9,900 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

West Bengal Assembly Election Result: "Not Sure How Pandemic Will Impact Poll Results," Says Senior Journalist Sagarika Ghose

May 02, 2021 07:49 (IST):

Trends and results can be accessed at https://results.eci.gov.in and "Voter helpline" mobile app available at Google Play Store and Apple App store